What To Do If You Lost Your PAN card: దేశంలో ఒక వ్యక్తి ఆదాయాన్ని లెక్కించడంలో పాన్ నెంబర్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లావాదేవీలు జరిపే సమయంలో మీ పాన్ నెంబర్ తప్పనిసరిగా అడుగుతుంటారు. అలాంటి పాన్ కార్డును ఒకవేళ మీరు ఏ కారణం వల్లనైనా కోల్పోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి ? పెద్ద చిక్కొచ్చిపడిందే ఇప్పుడెలా అని ఆందోళన చెందకండి. ఎందుకంటే ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్టుగానే ఈ సమస్యకు కూడా ఒక సొల్యూషన్ ఉంది.
మీ పాన్ కార్డు పోయినట్టయితే.. తిరిగి దరఖాస్తు చేయడం ద్వారా పాత కార్డు స్థానంలో డూప్లికేట్ పాన్ కార్డును పొందవచ్చు. అదెలాగో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూడండి. అయితే, అన్నింటికంటే ముందుగా మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మీ సమీపంలోని పోలీసు స్టేషన్‌కి వెళ్లి పాన్ కార్డు పోయిన విషయాన్ని వారికి తెలియజేస్తూ ఫిర్యాదు ఇవ్వడం మర్చిపోవద్దు. లేదంటే ఆ పాన్ కార్డ్‌ని ఇతరులు ఎవరైనా దానిని మిస్యూజ్ చేసే ప్రమాదం ఉంది.
1. నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి https://www.protean-tinpan.com/.
2. ఇప్పటికే ఉన్న పాన్ డేటాలో చేంజెస్ / కరెక్షన్ ఆప్షన్ ఎంచుకోండి.
3. మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తరువాత టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ వివరాలు మీ ఇమెయిల్‌కు వస్తాయి.
4. పర్సనల్ డీటేల్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, భౌతికంగా కానీ లేదా E-KYC కానీ లేదా E-సైన్ ద్వారా అక్కడ కోరిన సమాచారాన్ని సమర్పించండి.
5. మీ వ్యక్తిగత వివరాలను ధృవీకరిస్తూ మీ ఓటరు ఐడి కార్డ్ లేదా పాస్‌పోర్ట్ లేదా 10వ తరగతి సర్టిఫికేట్ కాపీలను నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ కార్యాలయానికి పంపండి.
6. e-KYC కోసం అధికారిక వెబ్సైట్లో ఆధార్ నెంబర్‌పై వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
7. ఇ-పాన్ లేదా ఫిజికల్ పాన్ నుండి మీకు అవసరమైన ఆప్షన్ని ఎంచుకోండి.
8. మీ చిరునామా వివరాలను పూరించి, పేమెంట్ చేయండి.
9. ఇండియాలో నివసించే వారు రూ. 50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విదేశాలలో నివసించే వారు రూ. 959 చెల్లించాల్సి ఉంటుంది.
10. మీరు 15 నుండి 20 రోజులలోపు మీ ఫిజికల్ పాన్ కార్డుని అందుకుంటారు.
11. ఇ-పాన్ కార్డ్ కేవలం 10 నిమిషాల్లోనే పొందవచ్చు. డిజిటల్ కాపీ రూపంలోనూ సేవ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Toyota Innova Hycross: వావ్.. హ్యూందాయ్ క్రెటా ధరలోనే 8 సీట్ల లగ్జరీ ఇన్నోవా కారు
ఇది కూడా చదవండి : Honda 100CC Bike: హోండా నుంచి 100CC బైక్.. ఎంట్రీ లెవెల్లోనే టాప్ మోడల్ ఫీచర్స్ ?
ఇది కూడా చదవండి : PAN-Aadhaar Linking: మార్చి 2023 లో మర్చిపోకుండా చేయాల్సిన ముఖ్యమైన పనులు
ఇది కూడా చదవండి : Royal Enfield Hunter 350: ఈ బైక్‌ని ఎగబడి మరీ కొంటున్న జనం.. 6 నెలల్లో లక్షకుపైగా బైక్స్ అమ్మకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook