Ravichandran Ashwin replaces James Anderson to Become World No 1 Test Bowler: భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్‌ను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టడంతో యాష్ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. తొలి టెస్టులో అశ్విన్ 8 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్ పర్యటనలో తొలి టెస్టులో రాణించిన జేమ్స్ ఆండర్సన్.. పాట్ కమిన్స్‌ను వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో నిలిచాడు. రెండో టెస్టులో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో రవిచంద్రన్ అశ్విన్ తొలి స్థానంకు దూసుకొచ్చాడు. తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి నంబర్ 1 ర్యాంకుకు చేరుకున్న జిమ్మీ.. రెండో టెస్టులో మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దాంతో ఆండర్సన్ ఎనిమిది రేటింగ్ పాయింట్లు కోల్పయి (856) రెండో స్థానానికి పడిపోగా.. 864 పాయింట్లతో ఆర్ అశ్విన్ నంబర్ 1గా నిలిచాడు. ప్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా, షాహిన్ ఆఫ్రిది టాప్-5లో ఉన్నారు.
2015లో ఆర్ అశ్విన్ తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. అప్పటి నుంచి పలు సందర్భాల్లో యాష్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇటీవలి కాలంలో టాప్ ర్యాంకు అందుకోని అశ్విన్.. తాజాగా అగ్ర పీఠం దక్కించుకున్నాడు. ప్రస్తుతం మొదటి స్థానం కోసం ప్యాట్ కమిన్స్, జేమ్స్ ఆండర్సన్, ఆర్ అశ్విన్ పోటీ పడుతున్నారు. అశ్విన్ ఇప్పటివరకు 90 టెస్టులు ఆడి 463 వికెట్స్ పడగొట్టాడు. ఐదు వికెట్స్ 31సార్లు పడగొట్టాడు.
మూడో టెస్టు నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఇండోర్ టెస్టులో యాష్ 9 వికెట్లు పడగొడితే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ ట్రోఫీలో యాష్ 103 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (111 వికెట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత అశ్విన్ జోరును చూస్తుంటే కుంబ్లే రికార్డు త్వరలోనే బద్దలు అయ్యే అవకాశం ఉంది.
Also Read: IND vs AUS 3rd Test: ముగిసిన మొదటి రోజు ఆట.. 47 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా!
Also Read: Hyundai Micro SUV: హ్యుందాయ్ నుంచి చౌకైన ఎస్యూవీ.. ఇక టాటా పంచ్ కౌంట్ డౌన్ ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.