హిందూమతంలోని జ్యోతిష్య ప్రకారం విజయం సాధించడానికి కష్టం ఒక్కటే సరిపోదు. ఆ వ్యక్తి జాతకం, గ్రహాల స్థానం, కుండలి అన్నీ కుదిరితేనే సాఫల్యం లభిస్తుంది. అందుకే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేరు. అదృష్టం లేదనో లేదా విధి రాతనో చెప్పుకుంటారు.
ఉదాహరణకు ఎవరైనా ఎదైనా ఇంటర్వ్యూ లేదా పరీక్షకు హాజరవాల్సి వచ్చినప్పుడు ఆత్మ విశ్వాసం లోపించి నిరాశ ఎదురౌతుంటుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని ఉపాయాలు లేదా చిట్కాలు పాటించడం వల్ల మీరు మీ విజయాన్ని నిశ్చితం చేసుకోవచ్చు. జ్యోతిష్యులు చెప్పే ఈ ఉపాయాలు ఆచరించడం కష్టమేమీ కాదు. చాలా సులభం. ఈ ఉపాయాలతో మీ విజయాన్ని ఖాయం చేసుకోవచ్చు.
విజయం కోసం పాటించాల్సిన చిట్కాలు
ఇంటి నుంచి ఏదైనా అత్యవసరైన పనిపై బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు గణేశుడిని ప్రార్ధించాల్సి ఉంటుంది. గణేశుడి పాదాల నుంచి సింధూరం తీసుకుని మీ నుదుట చిన్నగా పెట్టుకోవాలి. ఈ చిట్కా లేదా ఉపాయం ఆచరిస్తే అన్నింటా విజయం మీదే అవుతుంది. ఉద్యోగ ఇంటర్వ్యూ నుంచి పరీక్షళ వరకూ అన్నింట్లోనూ ఇది వర్తిస్తుంది. దాంతోపాటు మీ పని పూర్తయ్యాక గణేశుడికి ప్రసాదం సమర్పించాలి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా శుభ ముహూర్తంలో ఆదిత్య హృదయ స్తోత్రం తప్పనిసరిగా పఠించాలి. ఆ ఒక్కరోజే ఈ స్తోత్రాన్ని 108 సార్లు పఠించాలి. అంతేకాదు..ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కనీసం 21 సార్లు పఠించాలి. ఈ ఉపాయాన్ని పాటించడం వల్ల అత్యంత దరిద్రుడైన వ్యక్తి సైతం కోటీశ్వరుడౌతాడు. ఈ ఉపాయం ప్రత్యర్ధులతో ఎదురయ్యే ఇబ్బందులు, గ్రహ దోషాల్నించి కూడా విముక్తి కల్పిస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా పనిపై బయటకు వెళ్తున్నప్పుడు ఆ వారం ప్రకారం బట్టలు ధరించాలి. సోమవారం నాడు తెల్లనివి, మంగళవారం కేసరి రంగు లేదా రెడ్ కలర్, బుధవారం నాడు గ్రీన్, గురువారం నాడు పసుపు బట్టలు ధరించాలి. ఒకవేళ ఆ రంగు బట్టలు ధరించలేకపోతే కనీసం ఆ రంగు కర్చీఫ్ అయినా ఉంచుకోవాలి.
Also read: Budh Ast 2023: బుధుడి అస్తమించడంతో..ఆ 7 రాశులకు తిరగనున్న దశ, అంతా డబ్బే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook