How To Make Hair Fall Control Oil: జుట్టు మీ అందాన్ని పెంచుతుంది. కానీ ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది. దీనితో పాటు, మీ జుట్టు క్రమంగా సన్నబడుతోంది. ఇలాంటి సమస్యలే బట్టతలకు దారి తీయోచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే చాలా రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ని వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యలకు సులభమైన మార్గం.. ఇంటి చిట్కాలేనని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ మందార నూనె, బాదం నూనెలను కలిపి వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల జుట్టు అందంగా, ఒత్తుగా, దృఢంగా తయారవుతుంది. కాబట్టి ఈ నూనెను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ తయారీకి అవసరమైన పదార్థాలు:
రెండు స్పూన్ల మందార నూనె
రెండు స్పూన్ల బాదం నూనె
నూనె తయారి పద్దతి:
హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ చేయడానికి.. మొదట బాదం నూనె తీసుకోండి.
తర్వాత కొద్దిగా ఆ నూనెను వేడి చేసిన తర్వాత అందులో మందార నూనె వేసి కలపాలి.
ఇలా కలిపి నూనె ఓ బాటిల్ పోసుకుని మీరు ఎప్పుడైనా వినియోగించవచ్చు.
జుట్టుకు ఎలా అప్లై చేయాలి?
హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ తీసుకుని మీ తలకు బాగా అప్లై చేయండి.
జుట్టును కనీసం 5-10 నిమిషాలు మసాజ్ చేయండి.
ఒక గంట పాటు జుట్టును అలానే వదిలేయండి.
ఆ తర్వాత తేలికపాటి షాంపూ సహాయంతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook