Manchu Manoj on Son: కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు..మౌనిక కుమారుడిపై మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Manchu Manoj on Mounika Reddy Son: కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడని అంటూ ఉంటారని అది ఇదేనేమో అంటూ మంచు మనోజ్ కామెంట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 6, 2023, 04:11 PM IST
Manchu Manoj on Son: కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు..మౌనిక కుమారుడిపై మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Manchu Manoj Comments on Bhuma Mounika Reddy Son: ఇటీవల సినీ నటుడు మంచు మనోజ్ దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే అయినా చాలా ఘనంగా హైదరాబాద్ లో వీరి వివాహం జరిగింది. హైదరాబాదులో మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మీ నివాసంలో జరిగిన ఈ వివాహానికి మంచు మోహన్బాబు సహా సినీ రంగానికి చెందిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సైతం హాజరయ్యారు.

అయితే కేవలం సన్నిహితులకు మాత్రమే వీరి నుంచి ఆహ్వానం అందింది. అలా సన్నిహితంగా మెలిగే సినీ రాజకీయ ప్రముఖులు మాత్రమే వీరు వివాహానికి హాజరయ్యారు. ఇక వివాహం జరిగిన తర్వాత నిన్న కర్నూలు జిల్లా వెళ్లి ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి ఘాట్లో వారి సమాధులకు నివాళులర్పించిన ఈ కొత్త జంట ఈ రోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ సహా భూమా మౌనిక మీడియాతో మాట్లాడార.  

శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడని అంటూ ఉంటారని అది ఇదేనేమో అంటూ ఆయన కామెంట్ చేశారు. అసలు విషయం ఏమిటంటే భూమా మౌనిక రెడ్డికి 2016 వ సంవత్సరంలో బెంగళూరుకు చెందిన గణేష్ అనే వ్యక్తితో వివాహం అయింది. 2018లో నాగ భైరవరెడ్డి అనే కుమారుడికి మౌనిక రెడ్డి జన్మనిచ్చారు. తర్వాత భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా భర్తకు దూరమయ్యారు, విడాకులు కూడా తీసుకున్నారు. కానీ కుమారుడు మాత్రం ఆమె దగ్గర పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు కుమారుడిని సంబోధిస్తూ మంచు మనోజ్ ఈ మేరకు కామెంట్లు చేశారు.

ఇక పెళ్లయిన తర్వాత మౌనిక వాళ్ళ ఊరు ఆళ్లగడ్డకు వెళ్లి అక్కడ నుంచి తిరుమలకు వచ్చామని అలా రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జీవితంలో ఏది ఓడిపోయినా ప్రేమ ఓడిపోకూడదని అలా తమ ప్రేమ గెలిచిందని అన్నారు. తన తల్లిదండ్రులు ఆశీస్సులు తన అక్క సపోర్ట్, ఆశీస్సులు పైన ఉన్న మౌనిక తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నంతవరకు తమకేమీ కాదని మంచు మనోజ్ అన్నారు. 12 ఏళ్లుగా మౌనికతో తనకు పరిచయం ఉందని నాలుగేళ్లుగా ఇద్దరం చాలా బాధలు పడ్డాము, ఎన్నో వ్యతిరేకతల సైతం ఎదుర్కొన్నాము అయినా సరే గట్టిగా నిలబడి నాలుగేళ్లుగా అందరు దీవెనల కోసం ఎదురు చూశామని అన్నారు.

చివరికి శివుడి ఆశీస్సులతో ఒకటయ్యామని ఆ శివుడి ఆజ్ఞతోనే నడిచొచ్చే కొడుకు కూడా వచ్చాడని అన్నారు. ఇక తన సినిమా షూటింగ్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ త్వరలోనే తన సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచే మొదలు పెడుతున్నామని అన్నారు. ఇక తనకు సేవ చేయాలనీ ఉందని అయితే అందుకోసం రాజకీయాల్లోకి రావాలని లేదని ఒకవేళ రాజకీయాల్లోకి మౌనిక రావాలనుకుంటే తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక మంచు మనోజ్ దంపతులతో పాటు మంచు లక్ష్మి దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వారి వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు.

Also Read: Amitabh Bachchan Injured: అమితాబ్ గాయాలు నిజం కాదా.. అశ్వినిదత్ ఇలా అంటున్నారేంటి?

Also Read: Ibomma 2023 Fake Alert: ఐబొమ్మ వాడుతున్నారా? అయితే రిస్క్ లో పడ్డట్టే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News