MS Dhoni Record: ఐపీఎల్‌లో విన్నింగ్ సిక్స్ కొట్టడంలో నెం.1గా ఎంఎస్ ధోని..ఇది కదా కిక్కు!

MS Dhoni IPL Records: : ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వెటరన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ నాలుగో స్థానంలో ఉన్నా, సిక్సర్లు కొట్టిన రెండు ఆసక్తికరమైన రికార్డుల్లో ధోని అగ్రస్థానంలో ఉన్నాడు.

Last Updated : Mar 25, 2023, 06:44 PM IST
MS Dhoni Record: ఐపీఎల్‌లో విన్నింగ్ సిక్స్ కొట్టడంలో నెం.1గా ఎంఎస్ ధోని..ఇది కదా కిక్కు!

Dhoni Records in IPL: ప్రతి సారి లాగే ఐపీఎల్ కు రంగం సిద్ధం అవుతోంది. ఈసారి ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. అయితే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ కోసం ఎదురు చూస్తుంటే MS ధోని అభిమానులు మాత్రం ఆయన సిక్సులు కోసం ఎదురు చూస్తున్నారు. ధోనీ సిక్స్‌తో, స్టేడియం మొత్తం డ్యాన్స్ ప్రారంభమవుతుందని ఫాన్స్ అంటున్నారు.

ఇక ధోనీ ఐపీఎల్‌లో ఆడిన 12 సీజన్లలో ఎన్ని సిక్సర్లు కొట్టాడో, ఎన్నిసార్లు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌లు గెలిపించాడో తెలిస్తే ఆయనని సిక్సర్ల రారాజు అని అంటారు. ఆయన సిక్సులు చూసే ఆయనని అందరూ 'సిక్సర్ కింగ్’ అని పేరు పెట్టి పిలుస్తుంటారు. ఇక ఎంఎస్ ధోనీకి చెందిన ఈ రెండు IPL రికార్డులు మీకు తెలుసా? 

2011లో మహేంద్ర సింగ్ ధోని కొట్టి మ్యాచ్ గెలిపించిన సిక్స్‌ని ఎవరు మర్చిపోలేరు, కానీ ఐపీఎల్ చరిత్రలో, ధోనీ తన జట్టును ఒకే మ్యాచ్ 6 సార్లు సిక్స్‌లు కొట్టి గెలిపించాడు. 206 ఇన్నింగ్స్‌ల్లో ఆయన ఈ రికార్డును సాధించాడు. ఇక ధోనీ తర్వాత రవీంద్ర జడేజా, డేవిడ్ మిల్లర్ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీరిద్దరికీ చెరో 4 సిక్సర్ల రికార్డు ఉంది. అంటే, ఇద్దరూ తమ జట్లను వరుసగా 4-4 సిక్సర్లు కొట్టేలా చేశారు.

ఇక ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక సార్లు ఐపీఎల్ మ్యాచ్‌లో కనీసం ఒక సిక్స్ కొట్టిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ 116 సార్లు ఈ ఘనత సాధించాడు, ఇక ఈ జాబితాలో భారత క్రికెటర్లలో కూడా రెండో స్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 111 సార్లు ఈ ఘనత సాధించాడు.

ఇక మరోపక్ఐక పీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. ఈ టోర్నీలో 229 సిక్సర్లు కొట్టాడు ధోనీ. ఇక ఈ జాబితాలో గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్  142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు కొట్టాడు. ఇక ఈ జాబితాలో డివిలియర్స్ (257) రెండో స్థానంలో, రోహిత్ (240) మూడో స్థానంలో ఉండగా, పొలార్డ్ (223) ఐదో స్థానంలో, కోహ్లీ (218) ఆరో స్థానంలో ఉన్నారు.

ఇక మరోపక్క ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి జట్టుకు గట్టి సవాల్ ఎదురు కానుంది. 
Also Read: RGV on Keeravani: కీరవాణి మాటలకు చచ్చిన ఫీలింగ్ వస్తుందన్న వర్మ.. నిజంగా చచ్చిపోవచ్చంటున్న ఫ్యాన్స్!

Also Read: Amaravathiki Atu Itu : అమరావతి మీద కన్నేసిన త్రివిక్రమ్.. మహేష్ చేత రాజకీయం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News