KTR Defamation Suit: హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏఈ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు లీగల్ నోటీసులు పంపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని ఆరోపిస్తూ వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు.
సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్దాలను మాట్లాడుతున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారి పైన అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వీరికి లేదని పేర్కొన్న కేటీఆర్, ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు.
ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని హితవు పలికిన మంత్రి కేటీఆర్.. ఇప్పటికే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని గతంలోనే స్పష్టంచేసిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. ఈసారి పరువు నష్టం దావా నోటీసులకు ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.
ఇది కూడా చదవండి : KCR Review Meeting: కేసీఆర్ సమీక్షా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
ఇది కూడా చదవండి : Wines Bandh: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆరోజు మొత్తం వైన్స్ బంద్
ఇది కూడా చదవండి : Hyderabad Metro Second Phase: హైదరాబాద్ మెట్రోరైల్ సెకెండ్ ఫేజ్‌కు కేంద్రం నో.. మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK