ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో ఆగస్టు 1న జరగనున్న తొలిటెస్టులో విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించబోతున్నాడు. ఈ టెస్టు గెలిస్తే అత్యధిక టెస్టు విజయాలను అందుకున్న కెప్టెన్‌గా గంగూలీని అధిగమిస్తాడు. ఈ వరుసలో 27 టెస్టు విజయాలతో ధోనీ అగ్రస్థానంలో ఉండగా, 21 విజయాలతో గంగూలీ, కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నారు.ఆ తర్వాతి స్థానాల్లో అజారుద్దీన్ (14), సునీల్ గవాస్కర్ (7) ఉన్నారు. విరాట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, టీమిండియా టెస్టుల్లో 21 విజయాలు సాధించింది. స్వదేశంలో 13, విదేశాల్లో 8 టెస్టులు గెలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే విరాట్ 22 విజయాలతో దాదాను దాటేసే అవకాశం ఉంది.
బ్రిటిష్ గడ్డపై కోహ్లీ విధ్వంసం చూస్తాం: రవిశాస్త్రి
ఇంగ్లండ్‌లో రేపటి(ఆగస్టు 1) నుంచి మొదలుకానున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ బ్యాటింగ్ విధ్వంసం చూస్తామని కోచ్ రవిశాస్త్రి అన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పిచ్‌లపై దుమ్మురేపిన కోహ్లీ.. బ్రిటీష్ గడ్డపై కూడా రాణించి ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే విరాట్ ఆటతీరులో ఎంతో పరిణతి కనపడిందన్నారు.
విరాట్‌కు సవాల్ విసరండి: వాన్
టీమిండియాను నిలువరించాలంటే విరాట్ కోహ్లీని నిలువరించాలని, దూకుడుగా ఉండటమే ఇంగ్లాండ్‌కు ముఖ్యమని ఆ జట్టు మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ తెలిపాడు. 'ఈ సిరీస్‌లో టీమిండియా ప్రతీకారం కోసం ఎదురుచూస్తుంది. విరాట్ తన వ్యక్తిగత సామర్థ్యంతో పాటు నాయకుడిగా నిరూపించుకోవాలనే కసితో ఉంటాడు. అత్యుత్తమ జట్టును ఎదుర్కోవడం ఇంగ్లాండ్‌కు సవాలే. కోహ్లీకి ప్రతి మ్యాచ్ ఒక సవాల్ విసరాలి' అని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దిప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్