స్పైడర్ మ్యాన్ హెల్త్ సీక్రెట్స్ ఇవే

హాలీవుడ్ నటుడు టామ్ హాలండ్ గుర్తున్నాడా.. స్పైడర్ మ్యాన్ చిత్రం ద్వారా యావత్ ప్రపంచాన్నే ఆకట్టుకున్న యంగ్ టాలెంట్ ఈ కుర్రాడు.

Last Updated : Jul 31, 2018, 10:04 PM IST
స్పైడర్ మ్యాన్ హెల్త్ సీక్రెట్స్ ఇవే

హాలీవుడ్ నటుడు టామ్ హాలండ్ గుర్తున్నాడా.. స్పైడర్ మ్యాన్ చిత్రం ద్వారా యావత్ ప్రపంచాన్నే ఆకట్టుకున్న యంగ్ టాలెంట్ ఈ కుర్రాడు. అంతేకాదు.. మంచి శరీర ఆకృతితో బడా హీరోలకే ఛాలెంజ్ విసిరిన టామ్ హాలండ్  మంచి స్పోర్ట్స్‌మన్ మాత్రమే కాదు.. టాలెంటెడ్ జిమ్నాస్ట్ కూడా. తన ఉన్నతికి ప్రధాన కారణం తన ఆరోగ్యమేనని చెప్పే ఈ యంగ్ హీరో హెల్త్ సీక్రెట్స్ ఏంటో మనం కూడా తెలుసుకుందామా..!
 

*ఉదయం లేవగానే తన వ్యాయామంలో భాగంగా వార్మప్‌ చేస్తూ.. 15 పుల్ అప్స్, 30 డిప్స్, 25 పుష్ అప్స్ చేస్తాడట ఈ కుర్రాడు

*అలాగే వర్క్ అవుట్ సెషన్‌లో 25 సిటప్స్, 25 బాక్స్ జంప్స్ చేశాక..     100 మీటర్ స్ప్రింట్ కూడా తన పరుగులో భాగంగా కవర్ చేస్తాడు

*అలాగే ప్రతీ రోజూ 30 నిముషాలు జిమ్నాస్టిక్స్ లేదా బాక్సింగ్ ప్రాక్టీసు చేస్తాడు

*అలాగే వారాంతంలో తప్ప ఎప్పుడూ జంక్ ఫుడ్ ముట్టుకోడు టామ్. ఆయన రోజూ తినే తిండిలో ప్రొటీన్లు, కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉండేటట్లు చూసుకుంటాడట

*అదేవిధంగా, తన స్నేహితులతో కలిసి బాస్కెట్ బాల్ ఆడడం కూడా తన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందని చెబుతున్నాడు టామ్

*తన కండరాలను పటిష్టం చేసుకోవడం కోసం టామ్ ఎలక్ట్రానిక్ మజిల్ స్టిమ్యులేషన్ ప్రక్రియను అనుసరిస్తూ ఉంటాడు

*శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని చెప్పే టామ్, అప్పుడప్పుడు గోల్ఫ్ లాంటి ఆటలు కూడా ఆడతాడట.

 

 

@chrishemsworth and @bobbydazzler84 beat that!

A post shared by ✌️ (@tomholland2013) on

 

 

 

Spiderman push-ups 😝. @thebody_shapestudios @missfitkaren

A post shared by ✌️ (@tomholland2013) on

Trending News