Shardul Thakur Score on RCB in IPL 2023: ఐపిఎల్ 2023 టోర్నీలో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన 9వ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్ శార్థూల్ థాకూర్ రెచ్చిపోయాడు. కేవలం 29 బంతుల్లో 68 పరుగులు చేసి తన కెరీర్లోనే ది బెస్ట్ ఇన్నింగ్స్ పర్‌ఫార్మెన్స్ అందించాడు. శార్థూల్ థాకూర్ రెచ్చిపోయి ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.
ఐపిఎల్ కెరీర్లో శార్థూల్ థాకూర్‌కి ఇదే బెస్ట్ ఇండివిడ్యువల్ స్కోర్. శార్థూల్ థాకూర్‌ని ఎంపిక చేసుకుని తాము తప్పు చేయలేదని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యాజమాని షారుఖ్ ఖాన్ భావించేలా అతడు ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జూలు విధిల్చాడు. స్టేడియం చుట్టూ 9 ఫోర్లు, 3 సిక్సులు బాది స్కోర్ బోర్డ్‌ని పరుగులెత్తించాడు. థాకూర్ బ్యాటింగ్‌కి రావడానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 12 ఓవర్లకే కేవలం 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
ఆరు వికెట్లు పడిన తరువాత 7 నెంబర్ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన థాకూర్.. మ్యాచ్‌కి ఇక తానే పెద్ద దిక్కు అనేంతగా రెచ్చిపోయాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ అయిన శార్థూల్ థాకూర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై రెచ్చిపోయి ఆడిన తీరు చూస్తే.. బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని సైతం ఆకర్షించుకునేలా ఉంది.
Innings break!@KKRiders post a mammoth total of 204/7 in the first innings!
A challenging chase coming up for @RCBTweets. Can they do it ❓ #TATAIPL | #KKRvRCB
Scorecard ▶️ https://t.co/J6wVwbrI5u#TATAIPL | #KKRvRCB pic.twitter.com/dxCQXKYvAW
— IndianPremierLeague (@IPL) April 6, 2023
ఇది కూడా చదవండి : RR vs PBKS Match Highlights: రాజస్థాన్, పంజాబ్ మ్యాచ్‌లో చివరి వరకు తప్పని సస్పెన్స్.. చివరి ఓవర్లో మారిన ఫలితం
Lord Shardul Thakur entering dressing room after playing 68(29) at Eden Gardens 🤞✨..#KKRvRCB #IPL2023 #RCBvsKKR pic.twitter.com/xbvWu8LtoP
— Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) April 6, 2023
కేవలం 29 బంతుల్లో 68 పరుగులు చేసే క్రమంలో శార్థూల్ తాకూర్ తనకు తెలియకుండానే ఇంకొన్ని రికార్డులు సైతం సొంతం చేసుకున్నాడు. 7వ నెంబర్ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అంత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శార్ధూల్ థాకూర్ మూడో స్థానంలో ఉన్నాడు.
Lord Shardul Thakur🔥🥵 pic.twitter.com/iTOWpFOenr
— Pulkit🇮🇳 (@pulkit5Dx) April 6, 2023
𝙆𝙤𝙣𝙤 𝙠𝙤𝙩𝙝𝙖 𝙝𝙤𝙗𝙚 𝙣𝙖! 👏👏👏
Lord. Shardul. Thakur. pic.twitter.com/dnqPPLBPK0
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2023
గతంలో ఆండ్రూ రసెల్ 36 బంతుల్లో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, రెండో స్థానంలో డ్వేన్ బ్రావో కూడా 30 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఆ తరువాతి స్థానం మళ్లీ మన శార్థూల్ థాకూర్‌దే కావడం విశేషం. అంతేకాదండోయ్.. థాకూర్, రింకూ కలిసి 6వ వికెట్‌కి 103 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. టీ20 లీగ్ మ్యాచుల్లో ఆరో వికెట్ నష్టానికి అత్యధిక భాగస్వామ్యంలోనూ వీళ్లిద్దరి కాంబో మూడోది కావడం గమనార్హం. శార్థూల్ థాకూర్ పర్‌ఫార్మెన్స్‌కి కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నీ సత్తా ఏంటో మరోసారి నిరూపించావు అంటూ తమకు తోచిన రీతిలో పాజిటివ్ మీమ్స్ పోస్ట్ చేస్తూ శార్థూల్ థాకూర్‌పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదిలావుంటే, లక్ష్య ఛేదనకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ జట్టును కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. కోల్‌కతా స్పిన్నర్ల మాయాజాలం ముందు తేలిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దారుణంగా ఓటమిపాలైంది.
ఇది కూడా చదవండి : MS Dhoni To Tushar Deshpande: తుషార్ దేశ్‌పాండేకు ధోనీ సీరియస్ క్లాస్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK