Renu Desai Fires on Pawan Kalyan Fan రేణూ దేశాయ్‌కి పవన్ కళ్యాణ్ అభిమానులకు నిత్యం ఏదో వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కోసారి హద్దులు దాటుతుంటారు. ఆ సమయంలో రేణూ దేశాయ్ సహనం కోల్పోతుంది. పవర్ స్టార్ అభిమానులను నిలదీస్తుంటుంది. తాజాగా అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా ఓ అభిమాని చేసిన కామెంట్‌కు రేణూ దేశాయ్ ఇలా స్పందించింది. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
Also Read: Akira Nandan Birthday : అకిరా నందన్ బర్త్ డే స్పెషల్.. జూ. పవర్ స్టార్ రేర్ పిక్స్
మేడం ఇది చాలా అన్యాయం.. మా అకిరాను ఒకసారి అయినా చూపించండి.. మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది మాకు.. మీరు ఇలా హైడ్ చేయకండి.. అప్పుడప్పుడు అయినా వీడియోలో అకిరా బాబుని చూపించండి అని ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రేణూ దేశాయ్‌ని రిక్వెస్ట్ చేశాడు. కానీ రేణూ దేశాయ్‌కి ఈ కామెంట్ చూసి మండి పోయినట్టుంది.
మీ అన్న కొడుకు?.. అకిరా నా అబ్బాయి.. మీరు ఒక తల్లికి పుట్టలేదా?.. మీరు ఆయనకు వీరాభిమానులు అని నేను అర్థం చేసుకుంటాను.. పద్దతిగా మాట్లాడటం నేర్చుకోండి.. ఇలాంటి మెసెజ్‌లను నేను పట్టించుకోవడం మానేశాను.. మీరు హద్దులు మీరి ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఫ్యాన్‌ను నిలదీసింది రేణూ దేశాయ్. ఈ రోజు నా కొడుకు బర్త్ డే.. ఈ రోజు ఇలాంటి కామెంట్లు చూస్తుండటం నాకు బాధగా ఉంది.. అంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది.
ఇక చివరకు అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా అయితే రేణూ దేశాయ్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన కొడుక్కి 19 ఏళ్లు వచ్చాయని చెప్పింది.. చెట్టంత ఎదిగినా కూడా తల్లికి కొడుకే అని.. ఇంకా అకిరా నా ఒళ్లో సరిగ్గా సరిపోతోన్నాడు అంటూ తన కొడుకు మీద ప్రేమను కురిపించింది రేణూ దేశాయ్.
ఇక అకిరా నందన్ సినీ ఎంట్రీ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. జూ. పవర్ స్టార్ అనే ట్యాగ్‌ను ఇప్పుడు అకిరాకు ఇచ్చేశారు. అయితే అకిరా హైట్, లుక్స్‌కి టాలీవుడ్ ఫిదా అవుతుందని, ఒక్క సినిమా పడితే అన్నీ మారిపోతాయ్ అని పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరపడుతుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook