Covid19 Cases in India: ఆందోళన కల్గిస్తున్న కరోనా వైరస్, 24 గంటల్లో 10వేల కేసులు

Covid19 Cases in India: కరోనా వైరస్ కొత్త కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 24 గంటల్లో కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొన్నటి వరకూ పరిస్థితి ఒకలా ఉంటే..నిన్నటి నుంచి పూర్తిగా మారిపోయింది. భారీగా పెరుగుతున్న కేసులు కలకలం రేపుతున్నాయి  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2023, 10:13 AM IST
Covid19 Cases in India: ఆందోళన కల్గిస్తున్న కరోనా వైరస్, 24 గంటల్లో 10వేల కేసులు

Covid19 Cases in India: దేశంలో కరోనా మహమ్మారి కేసుల్లో ఒక్కసారిగా భారీగా పెరుగుదల కన్పించింది. గత కొద్దికాలంగా కేసుల సంఖ్య పెరుగుతున్నా ఇంత భారీస్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. పరిస్థితి ఇలాగే కొనసాగితే జూన్ నాటికి దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పీక్స్‌కు చేరడం ఖాయంగా తెలుస్తోంది. 

గత కొద్దికాలంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు వందల్లో ఉన్న పరిస్థితి నుంచి రోజుకు 5-6 వేల కేసులు నమోదయ్యే పరిస్థితికి చేరింది. నిన్నటి నుంచి మరింత అదుపుతప్పింది. గత 24 గంటల్లో ఏకంగా 10 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు కావడం భయం గొలుపుతోంది. దేశంలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కు చేరుకుంది. ఫలితంగా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. 

నిన్న దేశంలో 7,830 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే పదివేలు దాటేయడంతో ఫోర్త్ వేవ్ తప్పదనే సంకేతాలు కన్పిస్తున్నాయి. ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సూచిస్తున్నారు. రానున్న 10-12 రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని తెలుస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.

కరోనా యాక్టివ్ కేసులు దేశంలో 0.10 శాతంగా ఉంటే రికవరీ రేటు 98.71 శాతమంది. గత 24 గంటల్లో 5,356 మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ 4,42,10,127 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 10, 158 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతానికి చేరుకుంటే..వీక్లీ పాజిటివిటీ రేటు 4.02 శాతానికి చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,29,958 పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకూ 92.34 కోట్ల మందికి పరీక్షలు జరిగాయి. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. దేశంలో ఇప్పటి వరకూ 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.  గత 24 గంటల్లో 327 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. 

Also read: Karnataka Electins 2023: హిజాబ్ ఆందోళన నడిపించిన ఎమ్మెల్యేకు షాక్, టికెట్ ఇవ్వని బీజేపీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News