అమెరికాలో తెలుగు యువకుడు మృతి

అమెరికాలోని బ్లూమింగ్ టౌన్‌లో విషాదం చోటు చేసుకుంది.

Updated: Jun 4, 2018, 09:13 AM IST
అమెరికాలో తెలుగు యువకుడు మృతి

అమెరికాలోని బ్లూమింగ్ టౌన్‌లో విషాదం చోటు చేసుకుంది. మాన్రో సరస్సులో బోటింగ్ చేసేందుకు స్నేహితులతో కలిసి తోట అనూప్ (26) అనే తెలుగు యువకుడు వెళ్ళాడని.. బోటింగ్ అనంతరం ఈత కొడుతూ అతడు గల్లంతయ్యాడని అధికారులు తెలిపారు.

అనూప్ స్నేహితులు వెంటనే 911కి కాల్ చేసి సమాచారం అందించగా రెస్క్యూ సిబ్బంది గాలించి సోనార్ స్కానర్ల సహాయంతో 15 అడుగుల దిగువన నీటిలో గుర్తించి అనూప్ మృతదేహాన్ని వెలికితీశారని పేర్కొన్నారు. అనూప్ అద్భుతమైన ఈతగాడని స్నేహితుడు నిషాన్ గుత్తా చెప్పాడు. అంతేకాదు..అద్భుతమైన కళాకారుడు, సంగీతకారుడని.. చదువులో టాపర్ అని.. కుక్ మెడికల్‌లో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశారని పోలీసులకు స్నేహితులు చెప్పారు.