గల్ఫ్ ఏజెంట్ల మాయమాటల్లో పడి ఓ యువకుడు నిలువునా మోసపోయాడు. ఉపాధి దొరక్క దిక్కుతోచని స్థితిలో ఉన్న సమీర్ సౌదీ వెళ్లి నానా కష్టాలు పడుతున్నాడు. సరైన తిండి కూడా దొరక్క తనను స్వదేశానికి తిరిగి రప్పించాలంటూ రోధిస్తున్నాడు. ఈ మేరకు తన బాధను వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో సందేశాన్ని పంపాడు.
తిరిగి రప్పిస్తానని కేటీఆర్ హామీ
అతని కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షడు కేటీఆర్ కు కలిసి తన కుమారుడిని స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు . సమీర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేటీఆర్.. అతన్ని స్వదేశానికి రప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సమీర్ ను తిగిరి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని రియాద్ లోని ఇండియన్ అంబాసిడర్ ను కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
మోసపోయిన తీరు ఇది..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటకు చెందిన 21 ఏళ్ల సమీర్ జీవినోపాధి కోసం గత నెలలో సౌదీ అరేబియాకు వెళ్లాడు. సమీర్ కు పంక్షన్ హాల్ పని ఇప్పటిస్తానని చెప్పి నిజామాబాద్ కు చెందిన ఏజెంట్ఆశ చూపించాడు. పరాయి దేశానికి వెళితే కుటుంబ ఆర్ధిక ఇబ్బందులు తీరుతాయని బాధితుడు ఆశపడ్డాడు. ఏజెంట్ మాటలను గుడ్డిగా నమ్మిన ఆ యువకుడు రూ.83 వేల చెల్లించాడు.
అన్నం కూడా పెట్టకుండా వేధింపులు
తీరా అక్కడికి వెళ్లాక అతని ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. సమీర్ ను సౌదీలో గొర్ల కాపరిగా పెట్టుకున్న యాజమాని.. అతనికి సరిగా అన్నం కూడా పెట్టకుండా వేధిస్తున్నాడు. గత 20 రోజులుగా వేదన అనుభవిస్తున్నానని .. తనను స్వదేశానికి తీసుకురావాలని సమీర్ బోరును పిలపిస్తున్నాడు. ఈ మేరకు వీడియో సందేశాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు
Request Ambassador @drausaf Saab and @IndianEmbRiyadh to help this gentleman Sameer to return to India https://t.co/TwzSlzjIMq
— KTR (@KTRTRS) May 14, 2019