Sankranti holidays: సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు కాలేజీలకు ప్రభుత్వం హలీడేలను ప్రకటించింది.అయితే.. తాజాగా తీసుకున్న నిర్ణయంలో మరో రెండు రోజులు హలీడేలు కలిసిరానున్నట్లు తెలుస్తొంది.
తెలుగు నాట సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని పిలుస్తుంటారు. ఈ పండుగను ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమగా జరుపుకుంటాయి. అయితే.. చాలా మంది స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించగానే తమ సొంతూర్లకు వెళ్లిపోతుంటారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ముఖ్యంగా స్కూళ్లకు.. జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు తెలుస్తొంది.
అదే విధంగా.. కాలేజీలకు మాత్రం.. 11 నుంచి 16 వరకు హలీడేస్ ను ప్రకటించింది. ఈ క్రమంలో స్కూళ్లు మరల 18 శనివారం రోజు తెరుచుకొనున్నట్లు తెలుస్తొంది.
గతంలో సర్కారు ప్రకటించిర అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 13 నుంచి సెలవులు ఉండగా.. తాజాగా.. రెండు రోజుల ముందుగానే తెలంగాణ సర్కారు అధికారికంగా సెలవులు ఇచ్చినట్లు సమాచారం.
అయితే..11 వ తేదీ రెండో శనివారం, 12 ఆదివారం రావడంతో... రెండు రోజులు ముందుగానే హలీడేస్ ఇవ్వాలని తెలంగాణ సర్కారు అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.