Smart Donkey: ఈ వీడియో చూస్తే గాడిదల్లో కూడా తెలివైనవుంటాయని ఒప్పుకుంటారు!

Smart Donkey: ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పింది చేసేవారికి మరో పేరు కూడా ఉంది. గాడిదలా పనిచేస్తాడని. గాడిదలకు తెలివి కూడా తక్కువేనంటారు. మరి ఈ వీడియో చూస్తే ఆ అభిప్రాయం మార్చుకోవల్సిందే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 3, 2022, 07:44 AM IST
Smart Donkey: ఈ వీడియో చూస్తే గాడిదల్లో కూడా తెలివైనవుంటాయని ఒప్పుకుంటారు!

Smart Donkey: ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పింది చేసేవారికి మరో పేరు కూడా ఉంది. గాడిదలా పనిచేస్తాడని. గాడిదలకు తెలివి కూడా తక్కువేనంటారు. మరి ఈ వీడియో చూస్తే ఆ అభిప్రాయం మార్చుకోవల్సిందే..

భూమ్మీద ఉన్న జీవుల్లో మనిషి చాలా తెలివైనవాడు. ఇక జంతు జీవాల్లో కూడా కొన్ని తెలివైనవే ఉంటాయి. మరికొన్ని ఏ మాత్రం తెలివితేటల్లేకుండా గుడ్డిగా పోతుంటాయి. అటువంటి జీవుల్లో ఒకటి గాడిద. అయితే గాడిదకున్న మంచి లక్షణం ఏంటంటే..చెప్పింది చేయడం, ఎంత బరువైనా మోయడమే. తెలివిగా ఏదీ ఆలోచించవని అంటారు. అందుకే గాడిదలా ఎదిగావు..బుద్ధి మాత్రం లేదని తిడుతుంటారు. గాడిదలపై సాధారణంగా ఉండే అభిప్రాయమది. 

చాలా సందర్భాల్లో ఇది నిజం కూడా గాడిదలకు సొంతంగా ఆలోచించవు. చెప్పింది చేసుకుని పోతుంటాయి. ఇతరుల్ని ఫాలో అవుతుంటాయి. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఆ అభిప్రాయం మార్చుకుంటారు. గాడిదల్లో కూడా తెలివైనవి ఉంటాయని ఒప్పుకుంటారు. అక్కడ నాలుగు గాడిదలున్నాయి. ముందు అడ్డంగా ఓ కర్ర ఉంది. ముందు రెండు గాడిదలు ఆ కర్రపై నుంచి జంప్ చేసి దాటేశాయి. మూడవ గాడిద వంతు వచ్చింది. కాస్సేపు ఆలోచించింది. పరీక్షగా చూసింది. సింపుల్‌గా నోటితో కర్రను పట్టుకుని తీసి కింద పడేసింది. హాయిగా నడుచుకుంటూ దాటేసింది.

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News