అంబేద్కర్.. పెరియార్ నా ఫేవరేట్

"అంబేద్కర్, పెరియార్.. వీరిద్దరికీ నేను అభిమానిని. వీరిద్దరూ సామాజిక అసమానతలపై యుద్ధం చేశారు. సామాజిక న్యాయం కోసం చివరి శ్వాస వరకూ రాజీ లేకుండా పోరాడారు " అని ట్వీట్ చేశారు

Last Updated : Dec 6, 2017, 02:47 PM IST
అంబేద్కర్.. పెరియార్ నా ఫేవరేట్

అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకొని టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు. గొప్ప నాయకుడికి సెల్యూట్ అని తెలిపారు.  లండన్‌లోని అంబేద్కర్ హౌస్‌ని గతంలో సందర్శించిన ఆయన, ఆ ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

ముఖ్యంగా అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ కలిసున్న ఫోటో మీద తన అభిప్రాయాన్ని పంచుకుంటూ "అంబేద్కర్, పెరియార్.. వీరిద్దరికీ నేను అభిమానిని. వీరిద్దరూ సామాజిక అసమానతలపై యుద్ధం చేశారు.

సామాజిక న్యాయం కోసం చివరి శ్వాస వరకూ రాజీ లేకుండా పోరాడారు " అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు సంబంధించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర జిల్లా విజయనగరం పర్యటనకు బయలుదేరారు పవన్ కళ్యాణ్. ఆ పర్యటనలో జనసేన వైఖరి ఏమిటో తెలియజేయనున్నారు.  

 

Trending News