బేర్ గ్రిల్స్.. సాహసాన్ని ఇష్టపడేవారికి ఇతని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నరసంచారం లేని ప్రదేశాల్లో, దండకారణ్యం నుంచి మంచు లోయల వరకు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి నీటి చుక్క కనిపించి ఎడారి వరకు ఇలా రకరకాల ప్రాంతాల్లో సాహసాలు చేస్తాడు. స్థానికంగా లభ్యం అయ్యే వనరులను వినియోగించి బతకడం ఎలాగో బేర్ గ్రిల్స్ ( Bear Grylls ) ప్రపంచానికి తన వీడియోలతో నేర్పుతుంటాడు.
ALSO READ| Google Maps: ఇంటర్నెట్ లేకున్నా గూగూల్ మ్యాప్స్ ఇలా వాడవచ్చు
అతని సాహసయాత్రలు టీవీల్లో వీక్షించి ప్రేరణ పొందేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతర్జాతీయంగా బాగా గుర్తింపు తెచ్చుకున్న బేర్ గ్రిల్స్ ఇటీవలే భారత ప్రధాని మోదీ (PM Modi ), సూపర్ స్టార్ రజినీకాంత్ , బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వంటి వారితో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేశాడు.
బేర్ గ్రిల్స్ ట్విట్టర్ హ్యాండిల్లో తరచూ ఆసక్తికరమైన అంశాలను షేర్ చేస్తూ ఉంటాడు. తాజా బేర్ షేర్ చేసిన ఒక ఫోటో చాలా మందిని ఆకట్టుకుంది. అనేక మందిని ఆలోచించేలా చేస్తోంది. ఈ ఫోటోలో నార్వేలోని ఎస్సేయస్ పర్వతన సైనికులు మంచులో ఎలా కలిసిపోయి తమ దేశాన్ని రక్షిస్తున్నారో చూడండి అంటూ ట్వీట్ చేశాడు.
ఉసరవెల్లిలా పరిస్థితికి తగిన విధంగా వారు ఎలా మంచుదుప్పటిలా ఉన్న పర్వతంపై చెట్ల మధ్య దాక్కున్నారో చూడండి.. ఇందులో ముగ్గరు సైనికులు ఉన్నారు.. వారిని కనుక్కున్నారా అని ప్రశ్నించారు బేర్. ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ ( Viral ) అవుతోంది.
Great shot of SAS Mountain Troop soldiers on patrol in Norway... masters of camouflage and climbing. Can you see all 3?! #manyarecalledfewarechosen #whodareswins @pagoda22sas @royalmarines #specialforces pic.twitter.com/MRrmpINGYD
— Bear Grylls (@BearGrylls) October 7, 2020
ALSO READ| WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే
ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ ( Netizens ) వెంటనే ఇద్దరు సైనికులను కనుక్కున్నారు. కానీ మూడో సైనికుడిని కనుక్కోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తీరా కనుక్కున్నాకా.. ఊసరవెల్లిలా పరిసరాల్లో కలిసిపోయిన నార్వే జవాన్లను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ఆ ముగ్గరు సైనికులను మీరు కనుక్కోగలరేమో ఒకసారి ప్రయత్నించి చూడండి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR