Baby Elephant Fails to Climb Down Slope after Mother Elephant Shows: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. చిరుత, సింహం, ఏనుగు, మొసలి, కోతి, కుక్క, పిల్లి, పాములకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు భయంకరంగా ఉంటే.. మరికొన్ని సంబ్రమాశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ పిల్ల ఏనుగు తల్లి మాట వినకుండా చేసిన పని అందరిని నవ్వులు పూయిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ ఏనుగుల గుంపు అడవిలో వెళుతోంది. అందులో చిన్న ఏనుగులు కూడా ఉన్నాయి. ఏనుగులు అడవి మార్గంలో వెళుతుండగా.. ఓ చిన్న ఇసుక లోయ వస్తుంది. దానిలోకి ఎలా దిగాలో తల్లి ఏనుగు.. పిల్ల ఏనుగుకు చూపిస్తుంది. ముందు రెండు కాళ్లను కిందపెట్టి.. వెనకాల కాళ్లను నెమ్మదిగా కిందికి పెడుతుంది తల్లి ఏనుగు. పిల్ల ఏనుగును కూడా ఇలానే దిగాలని తల్లి ఏనుగు చెప్పకనే చెపుతుంది.
Mother: This is the last time I show you how to go down..
Son: pic.twitter.com/KJFaqJXq8M
— Buitengebieden (@buitengebieden) August 17, 2022
అయితే పిల్ల ఏనుగు మాత్రం తల్లి చెప్పిన విధంగా కాకుండా.. కింద పడుకుని బోర్లా పడుతుంది. ఆపై ఓ దొర్లు దొర్లి కిందకు వస్తుంది. మాములుగా చిన్న చిన్న ఏనుగులు తమ తల్లి ఎలా చెపితే అలా నడుచుకుంటాయి. కానీ ఈ పిల్ల ఏనుగు మాత్రం తల్లి ఏనుగు చెప్పినా వినలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోను ట్విటర్‌లో 'Buitengebieden' అనే పేజీ అప్ లోడ్ చేసింది. ఈ వీడియోకి లైకుల, కెమెంట్ల వర్షం కురుస్తోంది.
Also Read: నీ తెలివికి ఓ దండం సామి.. ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి!
Also Read: సెహ్వాగ్‌ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిదో తెలుసా.. అస్సలు ఊహించలేరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook