Viral Video: తెలివైన జంతువుల ప్రస్తావన వస్తే.. అందులో ఏనుగుల గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఏనుగులు మనుషులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతాయి. చాలా విషయాలను అర్థం చేసుకుంటాయి కూడా.
ఏనుగు, మనుషుల మధ్య ఉందే స్నేహపూర్వక బంధాన్ని ప్రతిబింభించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే మనుషులతో ఏనుగులు ఎంత అనుబంధం ఏర్పరుచుకుంటాయో అర్థమవుతుంది. దీనితో పాటు ఏనుగులు ఒక్కసారి ఎవరితోనైనా స్నేహం చేస్తే ఎప్పటికీ గర్తుంచుకుంటాయని కూడా తెలుసుకోవచ్చు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
థాయ్‌లాండ్‌కు చెందిన ఓ ఏనుగుల కేర్‌టేకర్ ఏడాది తర్వాత (14 నెలల తర్వాత) తన ఏనుగులను కలుసుకోగా.. అవి ఒక్క సారిగా అతని చుట్టూ చేరీ.. ఆప్యాయంగా అతడిని తొండెంతో హత్తుకున్నాయి.
ఓ నీటి కాలువలో ఏనుగుల కేరక్టేకర్ నిలుచుని.. దూరంగా ఉన్న ఏనుగుల పిలిచేందుకు ఓ విధమైన సౌండ్ చేశాడు. అయితే ఏడాది తర్వాత కూడా ఆ ఏనుగులు తమ కేర్‌టేకర్ గొంతును మరిచిపోలేదు. ఒక్క సారిగా అతడి వైపు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఆ వ్యక్తి కూడా ఏనుగులను చూడగానే వాటిని ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఆ వ్యక్తి పేరు డెరెక్ థాంప్సన్‌గా తెలిసింది.
వీడియోకు సంబంధించిన వివరాలు..
ఈ వీడియో థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్ నేచర్ పార్క్లోనిదిగా తెలిసింది. ఏనుగులను వివిధ ఆపదల నుంచి కాపాడి ఈ పార్క్‌లో పెంచుతుంటారు. ఇందులో ఏనుగులు సంచరించడానికి భారీ స్థలంతో పాటు వాటికి కావాల్సిన దాదాపు అన్ని వసతులు ఉంటాయి. ఆ ఏనుగులకు డెరెక్ థాంప్సన్ కేర్ టేకర్‌గా వ్యవహరించేవాడు.
వీడియోపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో భావోద్వేగపూరితంగా స్పందిస్తున్నారు. ఆ ఏనుగులు ఏంత ప్రేమతో ఉన్నాయని ఒకరంటే.. ఏనుగులు మనుషుల కన్నా చాలా తెలివైనవని మరొకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన వీడియోను మీరు చూసేయండి మరి.
Elephants reunite with their caretaker after 14 months..
Sound on pic.twitter.com/wSlnqyuTca
— Buitengebieden (@buitengebieden_) December 23, 2021
Also read: Viral Video: సింగర్ ముఖంపై కాటేసిన పాము.. ఇంతకీ ఏమైందంటే..?
Also read: Viral Photo: ఈ ఫోటోలో ఎన్ని గుర్రాలు ఉన్నాయో తెలుసా? మీరు కచ్చితంగా తప్పుగా గుర్తిస్తారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook