Trending Video: ఇదేం ‘ర్యాంప్ వాక్’ భయ్యా... నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్న వీడియో..

Viral Video Today: మీలో చాలా మంది ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చూసే ఉంటారు. ట్రెండీ డ్రెస్సులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తుంటారు. తాజా వీరిని అనుకరిస్తూ... ఓ వ్యక్తి వినూత్నంగా ర్యాంప్ వాక్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2022, 12:04 PM IST
  • వినూత్న రీతిలో ఓ వ్యక్తి ర్యాంప్ వాక్
  • నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
  • తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు
Trending Video:  ఇదేం ‘ర్యాంప్ వాక్’ భయ్యా... నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్న వీడియో..

Viral Video Today: సోషల్ మీడియాలో  (Social Media) ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాక్ కు గురిచేస్తాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో ఓ వ్యక్తి వినూత్న రీతిలో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ఇంతగా వైరల్ (Virla Video) కావడానికి అతడి ధరించిన దుస్తులు , పరికరాలే కారణం. ఈ వీడియోను డాక్టర్ అజయిత అనే ట్విటర్ యూజర్ తన ప్రొఫైల్‌లో "ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ షోలు" అనే క్యాప్షన్ తో  పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో సన్సెషన్ గా మారింది. 

ఈ వీడియోలో "మోడల్" షహీల్  షెర్మాంట్ ఫ్లెయిర్ ర్యాంప్ వాక్ చేశాడు. ఇతడు ఫ్యాషన్ షోలలో  ఉపయోగించే ఫాన్సీ దుస్తులకు బదులుగా ఇంట్లో వాడుకునే చిన్న చిన్న వస్తువులను ఎంచుకున్నాడు. ఈ వస్తువులను పట్టుకుని మోడల్స్ మాదిరిగా ర్యాంప్ వాక్  చేశాడు. ఇతడు తన ర్యాంప్ వాక్ లో... కుర్చీ, నిచ్చెన, అమ్మాయి, గేటు, ఇసుక జల్లించుకునే జల్లెడ, చెక్క బల్ల, డ్రమ్ము వంటి వస్తువులను ఉపయోగించాడు. ఈ వీడియో పై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.  అతను ఫ్యాషన్ షో చేస్తున్నాడా లేక ఇంట్లో దొంగతనం చేస్తున్నాడా ఉంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు , 80,000పైగా లైక్‌లను సాధించింది. 

Also Read: Viral Video Today: ఆమె గోడ పైకి విసిరే పిడకల ఫ్లో చూస్తే ఆశ్చర్యపోతారు.. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News