Viral Video: వధువుకి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన వరుడు.. వీడియో వైరల్

Viral Video: పెళ్లిని వేడుకలో జరపుకోవడం సర్వ సాధారణం. అలా పెళ్లి వేడుకల్లో.. వధువు ముందు డ్యాన్స్​ చేసి ఇంప్రెస్​ చేశాడు ఓ వరుడు. నెట్టింట వైరల్​గా మారిన ఆ వీడియో మీరూ చూసేయండి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 04:52 PM IST
  • పెళ్లి వేడుకల్లో వధువుకు వరుడు సర్​ప్రైజ్​
  • బాలీవుడ్​ పాటకు స్టెప్పులేసి ఆశ్యర్య పరిచిన వరుడు
  • నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: వధువుకి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన వరుడు.. వీడియో వైరల్

Viral Video: భారత సంప్రదాయాల్లో పెళ్లి అంటే ఓ పండుగ అనే చెప్పొచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని సంప్రదాయబద్దమైన పెళ్లిల్లో భారతీయ పెళ్లిల్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో ఎవరి పెళ్లి అయినా.. బంధువులు, మిత్రులు అంతా ఒకచోట చేరి సందడి చేయడం సాధారణం.

నూతన వధువు, వరుడు కలిసి డ్యాన్సులు చేయడం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా నడుస్తున్న ట్రెండ్​. పెళ్లికి ముందు కూడా దాండియా, సంగీత్​ వేడుకల్లో అందరూ డ్యాన్సులు చేయడం కూడా చూస్తుంటాం.

అలా కొత్తగా ఇంటికి వచ్చిన వధువును.. గ్రూప్ డ్యాన్స్​తో ఆహ్వానించేందుకు ఓ వరుడు సర్​ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇంటర్నెంట్​లో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.

వధువుకు సర్​ప్రైజ్​..

ఇంటికి వచ్చిన నూతన వధువు.. వరుడి సోదరిమణలు, చుట్టాల అమ్మాయిలు  కొంత మంది చేస్తున్న డ్యాన్స్​ చూసి ఎంజాయ్ చేస్తోంది. బాలీవుడ్​ సూపర్​ హిట్ మూవీ 'కుచ్​ కుచ్​ హోతా హై' సినిమాలోని 'సాజన్​ జీ గర్ ఆయా హై' పాటకు స్టెప్పులేస్తున్నారు. కొద్ది సేపటి తర్వాత సడెన్​గా ఆ డ్యాన్స్ చేసే గ్రూప్​లో వరుడు కూడా చేరి.. వారితో సింక్​లో స్టెప్పులేయడం స్టార్డ్ చేశాడు.

దీన్నిబట్టి ఆ వరుడు.. వధువును ఇంప్రెస్ చేయడానికి కావాలనే ఈ డ్యాన్స్ ప్లాన్ చేసినట్లు అర్థమైంది. వధువు కనీసం ఊహించని ఈ సర్​ప్రైజ్​తో ఆశ్యర్యపోయింది. తనపై వరుడి డ్యాన్స్​కు ముగ్దురాలైంది.

ఈ వీడియోను వెడ్డింగ్స్​ వరల్డ్ అనే ఇన్​స్టా పేజీ షేర్ చేయగా.. ఎంతో మంది వరుడిని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న సర్​ప్రైజ్​లు జీవితంలో చాలా గొప్ప అనుభూతులు మిగుల్చతాయని అంటున్నారు.

Also read: Viral Video: తాబేలును అమాంతం మింగబోయిన మొసలి.. చివరలో ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Also read: Viral Video: కంగారు కిక్ కు కింద పడ్డ వ్యక్తి, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News