King Cobra vs Nagamani: నాగమణికి కాపలాగా భారీ నాగుపాము, సినిమా కాదిది..నిజం, కెమేరాకు చిక్కిన అద్భుత దృశ్యం

King Cobra vs Nagamani: హిందూ పురాణాలు, పౌరాణిక సినిమాల్లో నాగమణి గురించి చూసుంటారు కదా.. నిజంగానే ఓ నాగుపాము నాగమణికి కాపలా కాయడం ఎప్పుడైనా చూశారా..అదే జరిగింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2022, 04:25 PM IST
  • నాగమణికి కాపలా కాస్తున్న భారీ నాగుపాము
  • కెమేరా కంటికి చిక్కిన అరుదైన దృశ్యం, వీడియో వైరల్
  • నిజమా కాదా అనే సందేహంలో నెటిజన్లు
King Cobra vs Nagamani: నాగమణికి కాపలాగా భారీ నాగుపాము, సినిమా కాదిది..నిజం, కెమేరాకు చిక్కిన అద్భుత దృశ్యం

King Cobra vs Nagamani: హిందూ పురాణాలు, పౌరాణిక సినిమాల్లో నాగమణి గురించి చూసుంటారు కదా.. నిజంగానే ఓ నాగుపాము నాగమణికి కాపలా కాయడం ఎప్పుడైనా చూశారా..అదే జరిగింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. 

నాగమణి అంటే తెలుసా. కొన్ని అరుదైన పాముల నెత్తిన ఉండే మణి. పాము తన శిరస్సులో మణిని దాచుకుంటుంది. అలాంటి పాముల కోసం అణ్వేషణ చేస్తుంటారు కొందరు. ఆ పామును వెతికి పట్టుకునే క్రమంలో ఆ పాము కాటుకు గురై మరణిస్తుంటారు. ఇదంతా ఇప్పటివరకూ వివిధ పౌరాణిక సినిమాల్లో చూసిన దృశ్యాలే. 

హిందూ పురాణాల ప్రకారం నాగమణికి, నాగుపాములు అంటే కింగ్ కోబ్రాలకు ప్రత్యేక స్థానముంది. హిందూవులు పవిత్రంగా ఆరాధించే శివుడి మెడలో కూడా నాగుపాము ఉంటుంది కాబట్టి..ప్రతి ఒక్కరూ నాగుపామును ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రత్యేకంగా నాగుల చవితి కూడా జరుపుకుంటారు. పాత గుడుల్లో శివలింగానికి లేదా అందులో ఉండే మణులు, వజ్ర వైఢూర్యాల సంపదకు నాగుపాము కాపలాగా ఉంటుందని కూడా అంటారు. వివిధ సీరియల్స్, సినిమాల్లో ఇదే ప్రస్తావన ఉంటుంది. 

అయితే మణులకు పాములు కాపలాగా ఉండటమనేది కేవలం సినిమాలు, సీరియల్స్‌లోనే ఇప్పటివరకూ చూస్తూ వచ్చాం. అంటే రీల్ లైఫ్‌లో మాత్రమే ఉండేది. రియల్ లైఫ్‌లో అలాంటివి ఎక్కడా లేవు. కానీ ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు. రియల్ లైఫ్‌లో కూడా జరుగుతుందా అని నోరెళ్లబెడతారు.

ఈ వీడియో ఎక్కడిదో తెలియదు. కానీ ఇందులో ఓ కింగ్ కోబ్రా..ధగధగ మెరిసిపోతున్న ఓ మణికి కాపలా కాస్తోంది. పడగ విప్పి అటూ ఇటూ చూస్తోంది. ఈ వీడియో చూసినవారంతా షాక్ అవుతున్నారు. నిజంగా ఇదెక్కడ జరిగిందంటూ ఆరా తీస్తున్నారు. పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది భయపడుతున్నారు. కేవలం 12 సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియో వైరల్ అవుతోంది. కొందరు మాత్రం ఫేక్ వీడియో అని కామెంట్లు పెడుతున్నారు. 

Also read: Received Potatoes on Meesho: ఆన్‌లైన్‌లో డ్రోన్ కెమెరా కోసం ఆర్డర్ చేస్తే ఏమొచ్చాయో చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News