Kumari Aunty: కుమారీ ఆంటీని కాపీ కొట్టిన ట్రాఫిక్ పోలీసులు.. యూజర్ చార్జీలు ఎక్స్ ట్రా అంటూ బైకర్ కు షాక్..

Viral News: సోషల్ మీడియా, యూట్యూబ్ ల ఎఫెక్ట్ తో కుమారీ ఆంటీ ఒక రేంజ్ లో పాపులర్ అయిపోయారు. కుమారీ ఆంటీకి చెందిన అనేక డైలాగ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 20, 2024, 01:57 PM IST
  • - కుమారీ ఆంటీ బాటలో ట్రాఫిక్ పోలీసులు..
    - రూల్స్ పాటించని బైకర్ కు ఊహించని షాక్..
Kumari Aunty: కుమారీ ఆంటీని కాపీ కొట్టిన ట్రాఫిక్ పోలీసులు.. యూజర్ చార్జీలు ఎక్స్ ట్రా అంటూ బైకర్ కు షాక్..

Hyderabad City Police Issued Challan To Bike Rider: సోషల్ మీడియా, యూట్యూబ్ ల పుణ్యామా అని... కొందరు ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోతుంటారు. తమకున్న ట్యాలెంట్ ను రీల్స్ , వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. మరికొందరు ఎక్కడైన వెరైటీగా ఏదైన ఉంటే వెంటనే తమ ఫోన్ లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం కుమారీ ఆంటీ ఓవర్ నైట్ లో  స్టార్ అయిపోయింది.

 

ఆమె కస్టమర్లను ఆప్యాయతగా, ప్రేమగా మాట్లాడటం చాలా మంది వార్తలలో నిలిచింది. ఎంతో మంది టెకీ ఉద్యోగులు, ఆమె దగ్గరకు వెళ్లి మరీ ఫుడ్ తింటుంటారు. ఆమె అనేక వెరైటీలలో నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్‌ లు కస్టమర్ల కోసం టెస్టీగా వండిపెడుతుంది. దీంతో ఆమె షాపుకు పెద్ద ఎత్తున, కస్టమర్లు పొటెత్తారు. దీంతో రోడ్డు మీద ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోవడంతో, పోలీసులు ఆమెను స్టాల్ తీసేయాలన్నారు. దీంతో కుమారీ ఆంటీ స్టాల్ సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఇక ఇది కాస్త సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లింది.

స్వతహాగా ఆయన కుమారీ ఆంటీని కలుస్తానని కూడా చెప్పారు. అంతే కాకుండా.. నిరుద్యోగులు సైతం కుమారీ ఆంటీని కలిసి, తమకు ఉద్యోగ ప్రకటన ఇచ్చేలా సీఎంతో చెప్పాలని వేడుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కుమారీ ఆంటీ ఒక ఫెమస్ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో నిలిచింది.

ఒక కస్టమర్ ఫుడ్ బిల్ గురించి కుమారీ ఆంటీ మాట్లాడుతూ... మీది మొత్తం 1000 అయ్యింది... రెండు లివర్ లు ఎక్స్ ట్రా.. అంటూ చెబుంది. ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ప్రస్తుతం కుమారీ ఆంటీ ట్రెండింగ్ డైలాగ్ ను ట్రాఫిక్ పోలీసులు కాపీ కొట్టారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు చెబుతుంటారు. కానీ కొందరు మాత్రం ట్రాఫిక్ రూల్స్ అస్సలు పట్టించుకోరు. వీరికి పోలీసులు తమదైన స్టైల్ లో సెటైరిక్ గా కామెంట్ లు చేస్తుంటారు.

Read More: Samyuktha Menon: నెమలిలా ఆకట్టుకున్న సంయుక్త…బ్లూ డ్రెస్ లో హీరోయిన్ అందాలు

తాజాగా, ఒక వ్యక్తి రోడ్డు మీద హెల్మెట్ ధరించకుండా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ రైడ్ చేశాడు. అంతేకాకుండా... ఫోన్ మాట్లాడుతూ.. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నడిపించాడు. ట్రాఫిక్ పోలీసులు ఫోటోను క్యాప్చర్ చేసి.. సదరు బైకర్ కు హెల్మెట్ లేనందుకు వెయ్యిరూపాయలు, యూజర్ చార్జీలు ఎక్స్ట్రా అంటూ కుమారీ ఆంటీ డైలాగ్ తో హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్ అకౌంట్ ఇమేజ్ పోస్ట్ చేసి.. కామెంట్ లను జతచేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మరీ.. కుమారీ ఆంటీ పాపులారిటీ మాములుగా లేదుగా అంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x