Alcohol Museum: మద్యం తయారీ చరిత్రను తెలిపేందుకు తాజాగా గోవాలో 'ఆల్కహాల్ మ్యూజియం' లాంచ్ చేశారు. దేశంలో ఇలాంటి మ్యూజియం ఇదే కావడం విశేషం. గోవా(Goa) మద్యపాన వారసత్వాన్ని ప్రోత్సహించడానికే తప్ప ఆల్కహాల్ వినియోగాన్ని పెంచడానికి కాదని ఈ మ్యూజియం వ్యవస్థాపకులు నందన్ కుడ్చడ్కర్ (Nandan Kudchadkar) వెల్లడించారు. ప్రపంచ చరిత్రలోనే మద్యం కాచే చరిత్రకు అంకితమిచ్చిన మొట్టమొదటి మ్యూజియంగా ఆయన పేర్కొన్నారు.
ఈ ఆల్కహాల్ మ్యూజియాన్ని 1,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్తర గోవా(North goa) బీచ్ లో నిర్మించారు. ఇది సిన్క్వెరిమ్, కాండోలిమ్ టూరిజం హబ్‌ను కనెక్ట్ చేసే ఓ బిజీ లేన్‌లో ఉంటుంది. అలాగే పనాజీకి దాదాపు 10 కిమీ దూరంలో ఉంటుంది. 'ఆల్ ఎబౌట్ ఆల్కహాల్' (All About Alochol) రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన మద్యం ఫెని(Feni) తయారీ విధానం గురించి తెలియజేస్తుంది.
Also read: Virgin boy egg: మూత్రంలో ఉడికించిన గుడ్లతో వంటకం..తింటే వదలరు...ఎక్కడో తెలుసా?
ఈ మ్యూజియంలో 1950 కాలం నాటి ఫెని (పులియబెట్టిన జీడిపప్పు లేదా కొబ్బరి నీళ్ల నుంచి తయారు చేసిన ఆల్కహాలిక్ డ్రింక్) బాటిళ్లు, ఫెని డ్రింక్ సర్వింగ్ గ్లాస్‌లు, పాత చెక్క డిస్పెన్సర్‌లు, కొలిచే పరికరాలు, ఉన్నాయి. గోవాలో జీడిపప్పుతో మద్యం తయారు చేసే కలను ప్రోత్సహించే లక్ష్యంతోనే వీటిని ప్రదర్శించారు. మ్యూజియం(Museum) లోపల నాలుగు గదులలో వివిధ పాత మట్టి కుండలు, 16వ శతాబ్దానికి చెందిన ఫెని సర్వింగ్ పరికరాలు, ఒక పురాతన చెక్క షాట్ డిస్పెన్సర్, ఫెని గాఢతను కొలవడానికి ఉపయోగించే 'గర్వ్' (స్కేల్), రష్యా నుంచి సేకరించిన క్రిస్టల్ ఆస్ట్రేలియన్ బీర్ గ్లాస్ ప్రదర్శనకు పెట్టారు. ఈ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన గ్లాస్‌వేర్, చాలీస్(chalices), స్నిఫ్టర్స్(snifters), వంపు తిరిగిన వైన్ గ్లాసెస్, ప్రపంచంలోనే ఎత్తైన పోలాండ్ షాట్ గ్లాస్(shot glass) ఇతర వస్తువులను కూడా చూడొచ్చు. మ్యూజియంలో ఒక సెల్లార్ కూడా ఉంది. ఇక్కడ 1950 కాలం నాటి జీడిపప్పు, కొబ్బరి ఫెని సీసాలు వరుసగా ప్రదర్శనకు పెట్టారు.
ఈ మ్యూజియంలో మునుపటి కాలంలో ఫెని తయారీ(peni alochol)కి ఉపయోగించే వివిధ పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. మ్యూజియంలోని నాలుగు గదులలో ఒకటి పాత స్టవ్‌లు, స్పూన్లు, మోర్టార్, పెస్టిల్స్, గ్రైండర్‌లు సహా గోవా సంస్కృతి(Goa culture)కి సంబంధించిన ఇతర వస్తువులకు ప్రదర్శనకు ఉంచారు. కుడ్చడ్కర్ తన తండ్రితో కలిసి తిరుగుతున్న సమయంలో పురాతన వస్తువులను సేకరించే అభిరుచిని పెంచుకున్నారు. మూడు దశాబ్దాల క్రితం అటువంటి వస్తువులను సేకరిస్తున్నానని వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి