King Cobra vs Mongoose: భారీ నాగుపాము, రెండు ముంగిసల మధ్య ఫైట్.. చివరకు ఊహించని ట్విస్ట్!

King Cobra vs Mongoose real Fight video goes viral. ఓ భారీ నాగుపాము రెండు ముంగిసలపై విజయం సాధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 27, 2022, 10:28 AM IST
  • నాగుపాము, ముంగిస మధ్య భీకర పోరు
  • చివరకు ఏది గెలిచిందంటే
  • ఊహించని ట్విస్ట్
King Cobra vs Mongoose: భారీ నాగుపాము, రెండు ముంగిసల మధ్య ఫైట్.. చివరకు ఊహించని ట్విస్ట్!

16 Feet King Cobra attacks Mongoose and win fight: నాగుపాము, ముంగిస.. ఈ రెండు బద్ద శత్రువులు అన్న విషయం ప్రతిఒక్కరికి తెలిసిందే. నాగుపాము, ముంగిస ఎప్పుడు ఎదురుపడినా..  హోరాహోరీగా తలపడుతాయి. అయితే ఈ పోరులో గెలుపు ఎవరిదిన్నది చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే.. నాగుపాము, ముంగిస మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఎక్కువగా ముంగిస పైచేయి సాధించినా.. పెద్ద నాగుపాములు మాత్రమే అప్పుడప్పుడు విజయం సాధిస్తాయి. ప్రస్తుతం ఓ భారీ నాగుపాము రెండు ముంగిసలపై విజయం సాధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... భారీ నాగుపాము ఓ పాడుబడ్డ బంగ్లాలో ఉంటుంది. దాదాపుగా 16 అడుగుల పొడవు ఉండే నాగుపాము పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటుంది. పైకి వెళ్లేందుకు వీలులేకపోవడంతో మరల కిందికి వస్తుంది. అదే సమయంలో రెండు ముంగిసలు లోపలికి వస్తాయి. అవి కూడా పైకి ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమవుతాయి. వెనక్కి వెళ్లిన ఆ రెండు ముంగిసలు మరోసారి లోపలి వస్తాయి. అప్పుడు వాటికి నాగుపాము కనిపిస్తుంది. 

నాగుపాము కనిపించగానే ఓ ముంగిస దాని వద్దకు వెళ్లి కరవడానికి ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన ఆ నాగుపాము పడగ విప్పి ఎదురుదాడి చేస్తుంది. ముంగిస ముందరే ఉండడంతో నాగుపాము బుసలు కొడుతూ దానిపై దాడి చేస్తుంది. భారీ నాగుపాము దెబ్బకు ముంగిస అక్కడి నుంచి పారిపోతుంది. ఇందుకు సంబందించిన వీడియోను రూబీ రుయాడో (Rubie Ruado) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతొంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 2,997,557 వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో కామెంట్ల వర్షం కురుస్తోంది. 

Also Read: IND vs AUS: సూపర్ ఫామ్‌లో విరాట్ కోహ్లీ..తన ఖాతాలోకి సరికొత్త రికార్డు..!

Also Read: భారత జట్టు ఇంకా ఎక్కడైనా మెరుగుపడాలా.. రోహిత్ శర్మ ఏం సమాధానం చెప్పాడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News