ఫేస్‌బుక్ ఫీచర్‌లో.. ఆన్‌లైన్ పాఠాలు

  

Last Updated : Nov 13, 2017, 02:07 PM IST
ఫేస్‌బుక్  ఫీచర్‌లో.. ఆన్‌లైన్ పాఠాలు

ఫేస్‌బుక్ వేదికగా ఆన్‌లైన్ మార్కెటింగ్ చేయాలనుకొనే వారికి ఇది నిజంగానే అద్భుతమైన అవకాశం. ఫేస్‌బుక్ మార్కెటింగ్‌పై కొత్తవారికి అవగాహన కల్పించడం కోసం, అదే సోషల్ మీడియా సైటులో ఒక ప్రత్యేక విభాగం ఉంది. దానినే "ఫేస్‌బుక్ బ్లూప్రింట్" అంటారు. ఈ విభాగంలో ఫేస్‌బుక్ వేదికగా వ్యాపారం చేయాలని భావించే వారి కోసం అనేక ఆన్‌లైన్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులన్నీ ఆ విభాగంలో ఉచితంగా చదువుకోవచ్చు. మీ సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు కూడా పెంచుకోవచ్చు. ఆన్‌లైన్ అమ్మకాలు సాగించడమెలా? అడ్వర్టైజింగ్‌ను మేనేజ్ చేయడం ఎలా? టార్గెట్ ఆడియన్స్‌ను ఎంచుకోవడమెలా? లాంటి అనేక టాపిక్స్ మీద ఈ  ఫేస్‌బుక్ బ్లూప్రింట్‌లో  పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలు చదివి ఫేస్‌బుక్ మార్కెటింగ్‌పై ఎవరైనా సరే ఒక అవగాహనకు రావచ్చు. ఆసక్తి ఉన్న ఉన్న కోర్సులు పూర్తి చేశాక ఆన్‌లైన్ ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఈ ఫేస్‌బుక్ బ్లూప్రింట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే https://www.facebook.com/blueprint వెబ్ పేజీని వీక్షించవచ్చు.

Trending News