Leopard Huts Monkey in Air: చిరుత వేటాడితే ఎలా ఉంటుందో తెలుసా..? చోటు ఏదైనా సరే వేటు తప్పనిసరి!

Leopard Vs Monkey Viral Video: సోషల్ మీడియాలో జంతువులు వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. రెండు జంతువుల మద్య పోరాటం, వేట సన్నివేశాలైతే ఇంకా ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఇలాంటి వేలాది వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. అందులో ఒకటి ఇది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2023, 04:11 PM IST
Leopard Huts Monkey in Air: చిరుత వేటాడితే ఎలా ఉంటుందో తెలుసా..? చోటు ఏదైనా సరే వేటు తప్పనిసరి!

Leopard huts Monkey in Air Viral got Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఇదొకటి. కేవలం 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో పెద్దఎత్తున వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదికల్లో షేర్ అవుతోంది. ఓ చిరుతకు, కోతికి మధ్య జరిగిన వేట దృశ్యమిది.

అడవి జంతువుల్లో చిరుతకు చాలా ప్రత్యేకత ఉంది. వేటకు, వేగానికి, నిశిత దృష్టికీ పెట్టింది పేరు. జంతువుల్లో ఏ జంతువులు అద్భుతంగా వేటాడతాయని పరిశీలిస్తే పిల్లి జాతి జంతువులే కిరీటాన్ని కొట్టుకుపోతాయి. ఎెందుకంటే అనితర సాధ్యమైన వేట దృశ్యాల్ని ఇప్పటి వరకూ చాలా చూసుంటాం. ఇళ్లలో ఉండే పిల్లల నుంచి అడవుల్లో ఉండే పులులు, సింహాలు, చిరుతల అద్భుతంగా వేటాడేవే. 

ఈ వీడియో చిరుతకు, కోతికి మధ్య జరిగిన పోరాటం దృశ్యం. అది కూడా నేలపై కాదు సుమా. ఓ చెట్టు నుంచి మరో చెట్టుపైకి దూకుతూ వేటాడుతున్న దృశ్యం. కోతి ఎంత లాఘవంగా ఓ చెట్టు నుంచి మరో చెట్టు మీదుకు దూకుతుందో అంతే లాఘవం, ఒడుపు, వేగంతో చిరుత కూడా దూకుతూ ఉండటం గమనించవచ్చు. కోతిని వేడాడుతూ చిరుత చేసే విన్యాసాలు..చివరికి కచ్చితమైన టైమింగ్‌తో కోతిని గాల్లోనే పట్టుకుని కిందకు లాక్కెళ్లిన అద్భుత దృశ్యం ఈ వీడియోలో ఉంది. అందుకే అంత వైరల్ అవుతోంది.

Also Read: Dalai Lama Kissing Controversy: బాలుడి పెదాలపై లిప్ కిస్.. తన నాలుక నాకమని ఆదేశం.. కొత్త వివాదంలో దలైలామా

చిరుతలు అవకాశవాదులు కావు, అద్భుతమైన విలక్షణమైన వేటజీవులనే ట్యాగ్‌లైన్‌తో ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ అయింది. అడవిలో జంతువులు వేటను మిస్ కానివ్వవు సాధారణంగా. అలాగే అనితర సాధ్యమైన వేటను కూడా సాధించి చూపించింది ఈ చిరుత. వైరల్ అవుతున్న వీడియోపై చాలామంది కామెంట్లు అందుకున్నారు. 

అంత ఎత్తు నుంచి పడితే వాటికి గాయాలు కావా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అవి పిల్లులని ఇంకొందరు కామెంట్ చేశారు. ఈ పిల్లులకు బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉండటంతో గాయాలు పెద్దగా కావని కొందరంటున్నారు. మరో వ్యక్తి నైస్ క్యాప్చర్..జో జీతా వహీ సికందర్ అని కామెంట్ చేశాడు.

Also Read: Baby Elephant Viral Video: పిల్ల ఏనుగు వింత చేష్టలు చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News