Man kisses cobra snake video viral: పాములు చాలా విషపూరీతంగా ఉంటాయి. వాటికి దూరంగా ఉండటమే మనకు బెటర్ అని చాలా మంది చెప్తుంటారు. కానీ కొంత మంది మాత్రం తమ పైత్యం కొద్ది పాములతో పరాచకాలు ఆడుతుంటారు. పాముల్ని చేతిలో పెట్టుకుని డెంజరస్ స్టంట్ లు చేస్తుంటారు. దానిలో ఆడుకొవడం అదేదో హీరొయిజం అనుకుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు పాములు, కోబ్రాలతో ఆడుకునేటప్పుడు అనుకొని ఘటనలు జరుగుతుంటాయి.
ఈ నేపథ్యంలో పాముల వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే భయంకరంగా ఉంటాయి. మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. అయితే.. ఒక వ్యక్తి పామును ముద్దుపెట్టుకున్నాడు. అది రివర్స్ లో అతనికి షాక్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పూర్తి వివరాలు..
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి పామును పట్టుకుని అదేదో తన గర్ల్ ఫ్రెండ్ లాగా మురిసిపోతున్నాడు. అది బుస్ ..బుస్.. అంటూ బుసలు కొడుతున్న ఏ మాత్రం భయంలేకుండా.. దానితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆ పాము అతని వైపు కోపంగా చూస్తు బుసలు కొడుతుంది. అతను మాత్రం.. ఆ పామును మెల్లగా తనవైపు తిప్పుకుని దాన్ని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు.
దాని పడగ కింది భాగంలో పామును ముద్దు పెట్టాడు. ఇంతలో పాములో కూడా పీలింగ్స్ అన్పించాయో ఏంటో కానీ.. అది కూడా అతడ్ని ఒక్కసారిగా కాటు వేసి మరీ ముద్దు పెట్టింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తొంది.
అయితే.. సమయానికి అతను ఆస్పత్రికి వెళ్లడం వల్ల ప్రాణాలతో బైటపడ్డాడంట. మొత్తానికి పాము వీడయో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి పైత్యంలు అవసరమా.. అంటూ అతగాడ్ని కూడా ఏకీపారేస్తున్నారు.