Monkey Funny Viral Video: ల్యాప్‌టాప్‌తో వర్క్‌ చేస్తున్న కోతి..ఈ వీడియో చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు..!!

Monkey Funny Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలే లక్షల కొద్దీ వైరల్ కావడం విశేషం. ఈ వీడియోలలో పెంపుడు కుక్క, పిల్లిలకు సంబంధించివే ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 10:56 AM IST
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జంతువుల వీడియోలు
  • ల్యాప్‌టాప్‌తో వర్క్‌ చేస్తున్న కోతి
  • ఈ వీడియో చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు
Monkey Funny Viral Video: ల్యాప్‌టాప్‌తో వర్క్‌ చేస్తున్న కోతి..ఈ వీడియో చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు..!!

Monkey Funny Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలే లక్షల కొద్దీ వైరల్ కావడం విశేషం. ఈ వీడియోలలో పెంపుడు కుక్క, పిల్లిలకు సంబంధించివే ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. ఈ మధ్య చాలా మంది ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా కోతులను పెంచుకుంటున్నారు. అవి చేసే చిలిపి చేష్టాలు ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఇటీవలే కాలంలో ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఓ అందమైన కోతి:
మనం చిన్నతనంలో చాలా రకాల కోతుల కథలను విన్నాం. ముఖ్యంగా మనుషులను అనుసరించే కోతుల కథలను పెద్దవారు చెబుతుంటే చాలా విన్నాం. అయితే కథలో ఉన్న కోతిలాగే ప్రస్తుతం మనిషులు చేసే పనులను అనుసరించి చేస్తున్న కోతి ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్‌ అవుతుంది.  ఈ కోతికి సంబంధించిన దృశ్యాలను మీరు ఈ కింది వీడియోలో చూడొచ్చు.

వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది:

ఎందుకు ఇంత వైరల్ అవుతుందో ఈ ఫన్నీ వీడియో చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో ముందుగా ఈ కోతి ఓ పిల్లవాడితో పడుకుని ఉంటుంది. ఆ తర్వాత వంటింట్లోంచి కొన్ని వస్తువులు తీసుకొచ్చి పిల్లల తలపై పెడుతుంది ఆ చిలిపి కోతి. అంతే కాకుండా ల్యాప్‌టాప్‌ను తానే ఓపెన్‌ చేసి ఆపరేట్‌ కూడా చేసింది.కొద్దీ సమయం తరువాత పెన్సిల్‌తో ఏదో గీసేందుకు కూడా ఆ కోతి ప్రయత్నించింది.

సరదాగా అలసిపోయిన కోతి:

ఇంత సరదాగా గడిపిన తర్వాత వీడియో చివర్లో మనం కోతి ముఖంలో అలసటను చూడొచ్చు. ఈ చిలిపి చేష్టాలను చేసిన కోతి చివరకు అలసిపోయిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. ఈ వీడియోను ఫన్నీ ఎనిమల్స్‌ అబూ(FUNNY ANIMALS ABU ) అనే యుట్యూబ్ ఛానెల్  ద్వారా పోస్ట్  చేశారు.

Also Read: Betel Leaves Fitness Tips: మీరెప్పుడైనా తమలపాకు నమిలి తిన్నారా? దీనిని తినడం ద్వారా వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

Also Read: Viral News: ఆస్పత్రిలో ఏడ్చినందుకు రూ.3,100 బిల్లు.. షాక్ లో పేషెంట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News