Shocking Video: మొసలి నోట్లో తల పెట్టిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Man Stunt With Crocodile: సోషల్ మీడియాలో ఇప్పుడు ఒళ్లు గగూర్పొడిచే వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ మొసలి నోరు అమాంతం తెరిచి ఉన్న క్రమంలో ఓ యువకుడు జారుకుంటూ వెళ్లి ఆ మొసలి నోట్లో తల పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియో చూసి తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 04:41 PM IST
Shocking Video: మొసలి నోట్లో తల పెట్టిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Man Stunt With Crocodile: సాధారణంగా సర్కస్ లు లేదా అనేక జంతు ప్రదర్శన శాలలో జంతువులతో మానవులు కలిసి విన్యాసాలు చేస్తుంటారు. అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను భయపెడుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోలో.. ఓ వ్యక్తి నోరు అమాంతం తెరిచిన ఓ మొసలి నోట్లోకి దూర్చాడు. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందోనని వీక్షకులు టెన్షన్ పడిపోయారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

మొసలితో విన్యాసాలు

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. మొసలితో ఓ యువకుడు విన్యాసాలు చేస్తున్నాడు. అదే సమయంలో మొసలి అమాంతం నోరు తెరుచుకొని ఉంది. అప్పుడే వచ్చిన యువకుడు జారుకుంటూ వచ్చి మొసలి నోట్లోకి తన తలను దూర్చాడు. 

కానీ, ఆ యువకుడ్ని మొసలి ఏ మాత్రం దాడి చేయలేదు. దాడి చేయకపోవడం సహా కదలకుండా అలానే ఉంది. ఆ వీడియో చూస్తున్న వారికి మొసలి ఆ యువకుడి తల కొరికేస్తుందేమోననే భయం కలుగుతుంది. దాన్ని చూసే వాళ్లకు గుండె దడ ఒక్క క్షణం పెరిగిపోతుందనడంలో సందేహమే లేదు. అయితే మొసలి.. యువకుడిపై ఎలాంటి దాడి చేయకపోవడం వల్ల అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. 

భయం లేకుండా ఎలా?

మొసలి భయంకరమైన, క్రూరమైన జంతువు అని అందరికీ తెలుసు. దాని స్వభావం క్షణాల్లో మారిపోవచ్చు. అనేకసార్లు ట్రైనర్లపై మొసళ్లు దాడి చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కానీ, ఈ వీడియోలో యువకుడు.. తన తలను మొసలి రెండు దవడల మధ్య పెట్టినా, అది దాడి చేయకపోవడం విశేషం. 

ఇలా ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో నేచర్.కామ్ అనే ఖాతా నుంచి పోస్ట్ అయ్యింది. 'ఇలా చేయాలనుకుంటున్న మీ స్నేహితులను ట్యాగ్ చేయండి' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అలా స్టంట్స్ చేయడం ఆరోగ్యానికి హానికరమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read: Google Meet Wedding: గూగుల్ మీట్ లో పెళ్లికి ఆహ్వానం.. జొమాటో ద్వారా విందుకు ఏర్పాట్లు!

Also Read: Snake Video: తలుపు మధ్యలో బుసలు కొడుతూ భయంకరమైన నాగుపాము...వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News