Snake Island: పాముల ఐస్లాండ్.. ప్రమాదకరమైన స్నేక్స్‌కి పుట్టినిల్లు.. ఈ దీవిపై వెళ్లే పక్షులకు కూడా ప్రమాదమే!

Very Dangerous Snake Island: ప్రస్తుతం చాలా మందికి ఐర్లాండ్‌లో ఉన్న పాముల దీవి గురించి తెలియదు. ఇది చాలా ప్రమాదకరమైన దీవిగా పిలుస్తారు. ఇంతకీ ఈ దీవిలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 10, 2024, 12:15 PM IST
Snake Island: పాముల ఐస్లాండ్.. ప్రమాదకరమైన స్నేక్స్‌కి పుట్టినిల్లు.. ఈ దీవిపై వెళ్లే పక్షులకు కూడా ప్రమాదమే!

Very Dangerous Snake Island: అక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదు.. వెళ్లిన వారు ఎవ్వరూ తిరిగి రాలేదు.. ఇక్కడ మనుషుల రాజ్యం చేల్లదు. ఇది పాముల రాజ్యం.. ఇప్పటివరకు మానవులు ఎవ్వరూ అడుగుపెట్టని ఈ ద్వీపం గురించి ఎంత మందికి తెలుసు? ఈ ద్వీపంలో అత్యంత ప్రమాదకరమైన పాములు పెరుగుతూ ఉంటాయి. ఎవరైనా అడుగుపెడితే ప్రాణాలతో తిరిగిరారు. ఈ ద్వీపం బ్రెజిల్‌కి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ద్వీపంపై మనుషులు కాలినడకన ప్రయాణించే ధైర్యం చేయలేరు. చివరిసారిగా ఈ ద్వీపం పైన అడుగు పెట్టిన వ్యక్తి శవమై తిరిగి వచ్చాడు. 

ఈ ద్వీపం పేరును అందురూ స్నేక్ ఐర్లాండ్‌గా పిలుస్తారు. అంటే పాముల దీవి.. ఈ పాముల దీవి ఒకానొకప్పుడు బ్రెజిల్ భూభాగంతో కలిసి ఉండేది. కానీ పదివేల సంవత్సరాల క్రితం సముద్రం పెరగడం వల్ల ఈ దీవి బ్రెజిల్‌కు దూరమైపోయింది. అప్పటి నుంచి ఈ ద్వీపంపై మానవ ఆవాసమే లేదు.. అందుకు మరో ముఖ్య కారణం బ్రెజిల్ ప్రభుత్వం ప్రజలు ఇటు రాకుండా కట్టడి చేయడమేనని చుట్టుపక్కన స్థానికులు తెలుపుతున్నారు. అయితే గంతలో అక్కడికి నివసించడానికి వెళ్లిన చిట్టచివరి మనిషి ఒకరు ఉన్నారు. అతడు సముద్రం గుండ వచ్చే పడవలకు స్తంభం ద్వారా 1920లో లైట్‌ సిగ్నల్స్‌ ఇచ్చేవాడు. కానీ ఈ పాములు అతడినే కాక అతని కుటుంబాన్ని కూడా బలి తీసుకున్నాయి. ఆ తర్వాత ఏ మానవుడు కూడా ఈ ద్వీపంపై నివసించే ధైర్యం చేయలేకపోయాడు.

ప్రభుత్వం కేవలం రెండు రకాల వ్యక్తుల్ని మాత్రమే ఈ దీవి రావడానికి అనుమతించేది. మొదటిది నావికదళ సిబ్బంది.. రెండవది మరమ్మతల కోసం వస్తూ ఉండేవారికి మాత్రమే అనుమతించేదని సమాచారం. అదే పనిగా ఇక్కడికి ఎవరైనా అడ్వెంచర్ చేయడానికి వచ్చారేమోనని కూడా అప్పుడప్పుడు ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉండేదట. అలాగే అప్పుడప్పుడు పాములపై రీసెర్చ్ చేసే పరిశోధకులు కూడా ఇక్కడి వచ్చేవారని సమచారం. అయినప్పటికీ వీళ్ళు కూడా ఈ ద్వీప మధ్య భాగానికి వెళ్ళకుండా దూరం నుండి తమ పనులు పూర్తిచేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారట. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి పాములు ఎలా వచ్చాయని చాలా మందికి ప్రశ్నమదిలో మెదులవచ్చు.? దానికి ఎన్నో రకాల జవాబులు వస్తూ ఉంటాయి. 

అన్నిటికంటే ఎక్కువగా వినిపించే జవాబు ఏంటి అంటే? కొన్నేళ్ల క్రితం ఇక్కడ సముద్రపు దొంగలు తమ ఖజానా దాచిపెట్టుకున్నారట.. ఇంకెవరు తమ ఖజానాను దొంగలించకుండా వాళ్లు పాములు తెచ్చి వదిలి పెట్టారని అంటూ ఉంటారు. ఈ కథ వినడానికి ఆసక్తికరంగానే ఉంది. నిజం అని అనిపించడం లేదని చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఇవే పాములు ఆ సముద్రపు దొంగలను కూడా చంపవచ్చు. మరో కారణం ఏంటంటే సైంటిఫిక్‌గా కొంచెం లాజికల్‌గా అనిపిస్తుంది. ఏంటంటే సముద్ర మట్టం తక్కువగా ఉండటం వల్ల ఇంకా ఎక్కువ సంఖ్యలో పాములు ఉండవచ్చు అన్నది.. పదివేల సంవత్సరాల క్రితం ఈ ద్వీపం బ్రెజిల్ నుంచ విడువడినప్పుడు ఇక్కడ ఇన్ని పాములు లేవు. కానీ కాలక్రమమైన పావులు ఇక్కడ ఉన్న ఇతర జీవరాశిని అంతం చేస్తూ.. ఈ రకంగా వాటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చిందని కొంతమంది నమ్ముతారు.

ఈ దీవిపై 4 వేలకు పైగా పాముల రకాలు ఉన్నాయట.. వీటి అన్నిటిలోకి అత్యంత విషపూరితమైన ది గోల్డెన్ హెడ్ వైపర్ కూడా ఉందని సమాచారం.. ఈ పాములు కేవలం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవి కేవలం ఈ దీవిలోనే కనిపిస్తూ ఉంటాయని సమాచారం.. ఈ పాము అత్యంత విషపూరితంగా ఉంటుంది. ఈ వైపర్‌ ఒకటిన్నర అడుగుల పొడవు  ఎగరగలవు కూడా..అలాగే వీటి విషం మానవుల మాంసాన్ని కూడా కరిగించగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. చాలా మంది ఈ పాములు ఇంత విషపూరితంగా మారడానికి కారణాలపై అనేక పరిశోధనలు చేశారు. అయితే ఇంత విషపూరితంగా మారడానికి ఈ ద్వీపం  నైసర్గిక పరిస్థితులు కూడా కావచ్చు. అసలు జీవరాసులే ఎంతో తక్కువగా ఉన్న ఈ ద్వీపంలో నివసించాలంటే ఈ పాములకు పక్షుని వేటాడ్డం తప్ప మరో ఆహారం లేదు. ఆ పక్షుల్ని వేటాడడం కోసమే పాములు తామ తాము ఎంతో వేషపూరితంగా తయారు చేసుకున్నాయని కూడా పరిశోధనల్లో తేలింది.. ఈ పాముల కాటుకు గురైతే ఏ పక్షి అయిన ఎగిరిపోవటం అసంభవం.. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

కానీ ఇప్పుడు ద్వీపంపై రాను రాను పక్షుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ పాములు ఎక్కువగా వలస వచ్చే పక్షులపై ఆధారపడి జీవిస్తున్నాయి. అలా తగ్గిపోతున్న ఆహార వనరుల కారణంగా ఈ ద్వీపంపై పాముల సంఖ్య కూడా తగ్గిపోతూ.. కూడా వస్తోంది. గత 50 ఏళ్లలో ఈ దీవిలో పాముల సంఖ్య సగానికి పడిపోయింది. ఇక్కడ లభించే ఎన్నో సర్పాల విషం మందుల తయారీకి కొన్ని సంస్థలు వినియోగిస్తూ కూడా వస్తోందట. అలాగే చట్ట విరుద్ధంగా పాముల వేట కూడా క్రమక్రమంగా పెరుగుతుందని సమాచారం. అందువల్ల పాముల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఈ విషయంలో బ్రెజిల్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ స్నేక్ ఐలాండ్ కేవలం పేరుకే పాముల దీవిగా మిగిలిపోయే రోజు ఎక్కువ దూరంలో లేదని చెప్పవచ్చు. ఐలాండ్ మాత్రమే మిగిలిపోయి పాములు మాత్రం అంతరించిపోతాయి. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News