Snake Viral Video: నదిలో ఈత కొడుతున్న యువకుడిని వెంటాడిన పాము.. చివరకు ఏమైందంటే?

Big Snake Enters River and chasing a young man. పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా నెట్టింట ఓ పాముకు సంబంధించిన ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 05:06 PM IST
  • భారీ పాము నదిలోకి వచ్చినా.. ఈత కొట్టిన యువతీయువకులు
  • యువకుడిని వెంటాడిన పాము
  • చివరకు ఏమైందంటే?
Snake Viral Video: నదిలో ఈత కొడుతున్న యువకుడిని వెంటాడిన పాము.. చివరకు ఏమైందంటే?

Snake Viral Video, Big Snake Enters River and chasing a young man: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఎంతో ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంకొన్ని మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అయితే వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అందులోనూ పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా నెట్టింట ఓ పాముకు సంబంధించిన ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. 

కొంతమంది విదేశీయులు నీలం రంగులో ఉన్న నది ప్రవాహంలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. యువతీయువకులు అందరూ ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద పాము నీటిలోకి ప్రవేశించి.. బండపై కూర్చున్న ఒక యువకుడి వెంట పడింది. పాము వెంటాడుతుండడంతో ఆ యువకుడు వెంటనే నీళ్లలో నుంచి బయటకు వెళ్ళాడు. అయితే ఆ యువకుడు భయపడకుండా ఈ దృశ్యంను తన మొబైల్‌లో బంధించాడు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wildistic ™ (@wildistic)

పెద్ద పాము నీటిలోకి రాగానే అందరూ ఒడ్డుపైకి చేరుకోగా.. ఓ యువకుడు మాత్రం అలానే ఈత కొడుతున్నాడు. అతడి పక్కనుంచే వచ్చిన పాము.. బండపై కూర్చున్న ఒక యువకుడి వెంట పడడం విశేషం. ఈ వీడియోను ఇటీవల ‘వైల్డ్‌స్టిక్‌’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్ చేశారు. దీనికి 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ మరియు 108k లైక్‌లు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు అందరూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: ఐపీఎల్‌ చరిత్రలో కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు.. రోహిత్, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు!

Also Read: ctress Death: చిత్ర పరిశ్రమలో విషాదం... ఉరేసుకుని ప్రముఖ నటి ఆత్మహత్య...    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News