6 Years Old Little Boy Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతూ..అందరి హృదయాల్ని ద్రవింపజేస్తూ..కంట నీరు పెట్టిస్తున్న ఈ ఘటన మద్యప్రదేశ్ సింగ్రౌలీ జిల్లాలో జరిగింది. వైరల్ అవుతున్న ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించి చర్యలకు ఆదేశించింది. అసలేమైందంటే..
నిరుపేదలకు ఆంబులెన్స్ సౌకర్యం అందని ద్రాక్షే. ఇది ముమ్మాటికీ నిజమని మరోసారి నిరూపిస్తున్న ఘటన ఇది. మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో చాలామంది నిరుపేదలకు వైద్య సదుపాయాలు, ఆంబులెన్స్ సౌకర్యం అందడం లేదని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ సింగ్రౌలీ జిల్లాకు చెందిన ఆరేళ్ల నిర్భాగ్యుడైన బాలుడు..ఏ విధంగా తన తండ్రిని వైద్య చికిత్స కోసం నాలుగు చక్రాల తోపుడు బండిపై లాక్కెళ్తున్న ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఇవాళ వెలుగుచూసింది. ఆరేళ్ల బాలుడు తల్లితో కలిసి తండ్రిని తోపుడు బండిపై లాక్కెళ్తున్న దృశ్యం. ఈ ఘటన సింగ్రౌళి జిల్లా బైలారి పట్టణంలో జరిగింది. ఈ కుటుంబం ఆంబులెన్స్ కోసం గంటల తరబడి నిరీక్షించింది. ఎంతసేపు చూసినా ఆంబులెన్స్ రాకపోవడంతో..వేరేదారిలేక అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని తోపుడు బండిపై లాక్కెళ్లే ప్రయత్నం చేస్తాడు.
शायद मध्य प्रदेश की एंबुलेंस गरीबों के लिए नहीं है,
इसलिए मरीज़ को ठेले पर लिटाकर अस्पताल ले जाया जा रहा है!!वीडियो मे मरीज़ की पत्नी और बेटे ठेले को धक्का लगाकर ले जा रहे है!#MadhyaPradesh #सिंगरौलीhttps://t.co/7uIlBCDFZq pic.twitter.com/VD6N5nSUow
— Sadaf Afreen صدف (@s_afreen7) February 11, 2023
ఓ వైపు తల్లి నెట్టుతుంటే..టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఆరేళ్ల బాలుడు ఆ తోపుడు బండిని ఎలా అదుపు చేస్తూ మూడు కిలోమీటర్లు నడిరోడ్డుపై బండిని లాక్కెళ్లిన దృశ్యం. అందర్నీ కలచివేస్తోంది. హృదయాల్ని ద్రవింపజేస్తోంది. అతికష్టంగా ఆ బండిని ఆసుపత్రి వరకూ లాక్కెళ్తాడు ఆ బాలుడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తరువాత సింగ్రౌలీ జిల్లా యంత్రాంగం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. వెంటనే దర్యాప్తుకు ఆదేశించింది. ఆంబులెన్స్ ఏర్పాటు లేకపోవడంతో ఆ ఆరేళ్ల బాలుడు, అతడి తల్లి కలిసి తోపుడు బండిపై ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆంబులెన్స్ ఎందుకు లభ్యం కాలేదనే కారణంపై ఛీఫ్ మెడికల్ ఆఫీసర్, సివిల్ సర్జన్ దర్యాప్తుకు ఆదేశించారు. ఆంబులెన్స్ సౌకర్యం లేక..మృతదేహాల్ని, రోగుల్ని,గర్భిణీ మహిళల్ని సొంత వాహనాలపై అతికష్టంగా తీసుకెళ్లే ఘటనలు మద్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో తరచూ కన్పిస్తూనే ఉన్నాయి.
Also read: Why Birds Won't Get Shock: కరెంట్ తీగలపై పక్షులకు ఎందుకు షాక్ తగలదో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook