Viral Video: భూమిని ముక్కలు చేయొద్దు ప్లీజ్​- రష్యా, ఉక్రెయిన్​ యుద్ధంపై చిన్నారి ఆవేదన!

Viral Video: గత నాలుగు రోజులుగా జరుగుతున్న యుద్ధం ఆపేయాలంటూ ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో వేడుకుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 07:08 PM IST
  • యుద్ధం ఆపేయాలని ఓ చిన్నారు కోరిక!
  • ప్రపంచశాంతి కోరుకుటున్నట్లు ముద్దు ముద్దు మాటలతో విజ్ఞప్తి!
  • చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
Viral Video: భూమిని ముక్కలు చేయొద్దు ప్లీజ్​- రష్యా, ఉక్రెయిన్​ యుద్ధంపై చిన్నారి ఆవేదన!

Viral Video: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుంటున్న విషయం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఉక్రెయిన్​పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటం.. వాటిని తిప్పికొట్టేందుు ఉక్రెయిన్ ప్రయత్నిస్తుండటాన్ని ప్రపంచమంతా చూస్తోంది. చాలా దేశాలు అయ్యో పాపం అనడం తప్ప.. ఉక్రెయిన్ తరఫున రష్యాను ఎదిరించేందుకు ప్రత్యక్షంగా ముందుకు రావడం లేదు.

అగ్రరాజ్యం అమెరికా సైతం ఆంక్షలు, మాటలతో సరిపెడుతోంది. జర్మనీ, ఫ్రాన్స్​లు తాజాగా ఉక్రెయిన్​కు ఆయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యాయి. దీనితో యుద్ధం మరింత తీవ్రం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాలు నెలకొన్నాయి. ప్రపంచం ప్రశాంతంగా ఉండాలని కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అందులో ఓ చిన్నారు ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ముద్దు ముద్దు మాటలతో యుద్ధం ఆపాలని..

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న పిల్లలు సైతం ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారు. అలా ఓ చిన్నారి కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేసింది.

'భూమిపై ప్రశాంతత ఉండాలని కోరుకుంటున్నా. భూమిని దయచేసి ముక్కలు చేయొద్దు. మనమంతా అన్నాదమ్ములం, అక్కా చెల్లెల్లం. యుద్ధం ఆపండి.' అంటూ ముద్దు మాటలతో కోరింది. ఈ వీడియోను brittikitty అనే ఇన్​స్టా పేజీ షేర్ చేసింది.

చిన్న వయసులో ఆ పాప ప్రపంచ శాంతి గురించి చెప్పడం చూసి నెటిజన్లు మగ్దులవుతున్నారు. కనీసం ఇలాంటి చిన్నారుల భవిష్యత్​ కోసమైన.. యుద్ధం ఆపాలని కోరుతున్నారు. ఇన్​స్టా గ్రామ్​లో స్టాప్​ వార్​ హ్యాష్​ ట్యాగ్​లను ట్రెండ్​ చేస్తున్నారు.

ఒక చిన్న ప్రయత్నమే పెద్ద పెద్ద విషయాలకు నాంది అన్నట్లు.. ఈ చిన్నారి కోరిక ఫలించి యుద్ధం ఆగిపోవాలని.. ఆ పాప కోరిక మేరకు ప్రపంచ శాంతి నెలకొనాలని అందరూ ఆశిస్తున్నారు.

Also read: Sachin Tendulkar: గాయపడిన పక్షిని కాపాడిన సచిన్, వీడియో వైరల్

Also read: Electron Bot Malware: మీ ఫేస్‌బుక్, గూగుల్ ఎక్కౌంట్లకు పొంచి ఉన్న ప్రమాదం, కొత్తరకం వైరస్, తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News