Viral video: JCB లో పెళ్లి మండపానికి వెళ్లిన వధూవరులు.. వీడియో వైరల్

Wedding couple baaraat in JCB, video goes viral: ఖరీదైన కారులోనో లేక గుర్రపు బండిపైనో బరాత్‌లో (Wedding baaraat) పాల్గొంటే పెద్ద కిక్కేముంది ? ఇలా వెరైటీగా, ఇంతకు ముందెవ్వరూ చేయని విధంగా జేసీబీలో పెళ్లి వేడుకకు వెళ్తే ఆ కిక్కే వేరప్పా అనుకున్నట్టున్నారు ఈ జంట.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2021, 11:42 AM IST
Viral video: JCB లో పెళ్లి మండపానికి వెళ్లిన వధూవరులు.. వీడియో వైరల్

Wedding couple baaraat in JCB, video goes viral: పెళ్లి అంటే జీవితంలో ఎవరికైనా ఓ గొప్ప వేడుక లాంటిది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. పెళ్లి వేడుక జీవితాంతం గుర్తుండిపోయేలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని చాలా మంది ప్లాన్ చేస్తారు. ఇంకొంత మంది బాగా డబ్బున్న వాళ్లు డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా ప్లాన్ చేస్తారు. ఇదంతా ఒక రకమైతే.. డబ్బులు ఉన్నా లేకున్నా.. హంగూ, హార్బాటాలకు పోకుండా తక్కువ ఖర్చులోనే సింపుల్‌గా పెళ్లి తంతు పూర్తి చేయాలని అనుకునే వాళ్లు ఇంకో రకం. 

ఈ రెండు రకాలు కాకుండా, ఎకనమిక్ స్టేటస్‌తో సంబంధం లేకుండా పెళ్లి వేడుకలు ప్లాన్ (Wedding plans) చేసే మూడో రకం కూడా ఉంటుంది. ఆ మూడో రకమే వెరైటీ రకం (Variety weddings). అర్థం కాలేదా ? అయితే ఇదిగో ఈ వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది.

Also read : Viral Video: మెుసలి మరో మెుసలిని తినడం చూశారా? ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

చూశారు కదా! ఖరీదైన కారులోనో లేక గుర్రపు బండిపైనో బరాత్‌లో (Wedding baaraat) పాల్గొంటే పెద్ద కిక్కేముంది ? ఇలా వెరైటీగా, ఇంతకు ముందెవ్వరూ చేయని విధంగా జేసీబీలో పెళ్లి వేడుకకు వెళ్తే ఆ కిక్కే వేరప్పా అనుకున్నట్టున్నారు ఈ జంట. అందుకే కార్లు, గుర్రపు బండీలు లాంటి సంప్రదాయాలకు గుడ్ బై చెప్పి ఇలా జేసీబీ లోడింగ్ బకెట్ ఏరియాలో నిలబడి వెళ్లి సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకున్నారు.

జేసీబీ ముందర లోడింగ్ బకెట్‌లో నిలబడి వస్తున్న కొత్త జంటను చూసి బంధుమిత్రులు, జనం విజిల్స్ వేస్తూ, కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. తాజాగా పాకిస్థాన్‌లోని హుంజా లోయలో చోటుచేసుకున్న ఈ ఘటనను అక్కడి జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ (Viral video) అవుతోంది.

Also read : Viral Video: 120కి.మీ స్పీడులో వెళ్తున్న కారు అద్దంపై పాము... ఆశ్చర్యపోతున్న నెటిజన్లు !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News