Positive Video: జాబ్ వచ్చిన ఆనందంలో ఈ అమ్మాయి ఎలా డ్యాన్స్ చేసిందో చూడండి.

ఉద్యోగం వచ్చినప్పుడు ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఎన్నో ప్రయాత్నాలు చేసిన తరువాత వచ్చే ఉద్యోగం ( Job ) విలువ ఏంటో మనలా చాలా మందికి తెలిసిందే. ఎగిరి గెంతులేస్తాం. 

Last Updated : Oct 6, 2020, 08:39 PM IST
    • ఉద్యోగం వచ్చినప్పుడు ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంటుంది.
    • చాలా కాలం నుంచి ఎన్నో ప్రయాత్నాలు చేసిన తరువాత వచ్చే ఉద్యోగం విలువ ఏంటో మనలా చాలా మందికి తెలిసిందే.
    • ఎగిరి గెంతులేస్తాం. కొంత మంది మనసులోనే సంతోషాన్ని ఫీల్ అయితే.. కొంత మంది మాత్రం అందంగా వ్యక్తపరుస్తారు.
Positive Video: జాబ్ వచ్చిన ఆనందంలో ఈ అమ్మాయి ఎలా డ్యాన్స్ చేసిందో చూడండి.

ఉద్యోగం వచ్చినప్పుడు ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఎన్నో ప్రయాత్నాలు చేసిన తరువాత వచ్చే ఉద్యోగం ( Job ) విలువ ఏంటో మనలా చాలా మందికి తెలిసిందే. ఎగిరి గెంతులేస్తాం. కొంత మంది మనసులోనే సంతోషాన్ని ఫీల్ అయితే.. కొంత మంది మాత్రం అందంగా వ్యక్తపరుస్తారు.

కొత్త జాబ్ దొరకడంతో ఇక అమ్మాయి కూడా తన సంతోషాన్ని ఇలాగే ఎక్స్ ప్రెస్ చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ అవుతోంది. ఒక వీడియో గేమ్ సంస్థలో జాబ్ దొరికిన తరువాత ఆ అమ్మాయి పడిన ఆనందం.. దాన్ని చూస్తే మనక్కూడా అదే ఆనందం కలుగుతుంది.

ALSO READ| Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? ఈ విషయంలో జాగ్రత్త

ఈ సీన్ ఒక సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఒక బిల్డింగ్ బయట సంతోషంతో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. 

ఈ వీడియోను ఆమె బాస్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ( Viral Video ) గురించి వర్ణిస్తూ..

 
 
 
 
 

ఈ అమ్మాయిని మేము ఇటీవలే ఉద్యోగానికి ఎంపిక చేశాము. తను ఎంత సంతోషంగా ఉందో చూడండి అని ట్వీట్ చేసింది.

ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట

 

ఈ వీడియోను సుమారు 5 మిలియన్ల సార్లు చూశారు. చాలా మంది అమ్మాయి ఆనందం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం అంటున్నారు. ఆమెను ప్రోత్సాహిస్తూ కామెంట్ చేశారు కొందరు. 

దేవుడా.. ఈ అమ్మాయికి జాబ్ ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ఇలాగే తన జీవితం సంతోషకరంగా ఉండేలా చూడు అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

 

 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

 

Trending News