Facebook Outage: ఫేస్‌బుక్ సేవలు నిలిచిన ఆ సమయంలో ఏం జరిగింది, రష్యా ఏజెన్సీ చెప్పింది నిజమేనా

Facebook Outage: ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల డేటాను అమ్మేశారా..సేవలు నిలిచిన 7 గంటల్లో ఏం జరిగింది. రష్యన్ ప్రైవసీ అఫైర్స్ చెబుతున్నది ఎంతవరకూ నిజం. ఆ షాకింగ్ వివరాలంటే పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 5, 2021, 05:17 PM IST
  • ఫేస్‌బుక్ సేవలు నిలిచిన సమయంలో ఏం జరిగింది, రష్యన్ ఏజెన్సీ చెప్పింది నిజమేనా
  • ఫేస్‌బుక్ సేవలు నిలిచిన సమయంలో హ్యాకర్లు 1.5 బిలియన్ల యూజర్ల డేటా అమ్మేశారా
  • నిర్ధారణ ఉందంటున్న రష్యన్ ప్రైవసీ అపైర్స్ నివేదిక
Facebook Outage: ఫేస్‌బుక్ సేవలు నిలిచిన ఆ సమయంలో ఏం జరిగింది, రష్యా ఏజెన్సీ చెప్పింది నిజమేనా

Facebook Outage: ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల డేటాను అమ్మేశారా..సేవలు నిలిచిన 7 గంటల్లో ఏం జరిగింది. రష్యన్ ప్రైవసీ అఫైర్స్ చెబుతున్నది ఎంతవరకూ నిజం. ఆ షాకింగ్ వివరాలంటే పరిశీలిద్దాం.

అక్టోబర్ 4వ తేదీ రాత్రి 9 గంటల్నించి హఠాత్తుగా ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు(Facebook Outage)నిలిచిపోయాయి. తిరిగి 7 గంటల తరువాత ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో ఆ సేవలన్నీ రీస్టోర్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ పరిణామంలో ముందు సర్వర్ డౌన్ కావడం కారణమని తెలిసినా..తరువాత బీజీపీ మ్యాన్యువల్ అప్‌లోడ్‌లో జరిగిన సాంకేతిక సమస్య కారణమని తెలిసింది. ఎందుకు జరిగింది ఎలా జరిగిందనేది ఇంకా స్పష్టత లేకపోయినా..ఫేస్‌బుక్ సంస్థకు మాత్రం 7 గంటల విఘాతం కారణంగా 50 వేల కోట్ల భారీ నష్టం కల్గిందని అంచనా. 

అయితే రష్యన్ ప్రైవసీ అఫైర్స్(Russian Privacy Affairs)ఈ వ్యవహారంపై షాకింగ్ విషయాలు వెల్లడించింది.ఫేస్‌బుక్ గ్లోబల్ నెట్‌వర్క్‌కు అంతరాయం కల్గిన సమయంలో ఏం జరిగిందనేది వెల్లడించినప్పుడు అందరూ షాక్‌కు గురయ్యారు. సేవలకు విఘాతం కలిగిన ఆ సమయంలో హ్యాకర్లు రంగప్రవేశం చేశారని..డార్క్ వెబ్ ఫోరమ్‌లో ఫేస్ బుక్ యూజర్ల డేటా(Facebook Users Data) విక్రయించారని రష్యన్ ప్రైవసీ అఫైర్స్ వెల్లడించింది. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. ఫేస్‌బుక్ యూజర్ల చిరునామా, పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబర్లను అమ్మకానికి ఉంచినట్టు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం ఏకంగా 1.5 బిలియన్ ఫేస్‌బుక్ ఖాతాలు డార్క్ వెబ్‌లో(Dark Web)అమ్మకానికి వచ్చినట్టుగా రష్యన్ ప్రైవసీ అఫైర్స్ చెబుతోంది. కొంతమంది హ్యాకర్లు ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారనేందుకు నిర్ధారణ ఉందంటోంది. అయితే ఈ వ్యవహారంపై ఫేస్‌బుక్(Facebook)ఇంకా ఏ విధమైన ప్రకటన చేయలేదు. 

Also read: Facebook Outage: ఫేస్‌బుక్ సేవలు ఆగడానికి కారణం ఎవరు, అందరూ ఊహించింది కాదా, భారీ నష్టమేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News