Highest Currency Note: ఇండియాలో రూ. 5 వేలు, రూ. 10,000 నోట్లు కూడా ఉండేవి తెలుసా ?

Highest Currency Notes in India: రూ. 2 వేల నోటు రాకతో దేశంలో చాలామందికి ఒక సందేహం కలిగింది. మన దేశంలో రూ. 2000 నోటు కంటే పెద్ద డినామినేషన్‌లో ఏదైనా నోటు వచ్చిందా లేక ఇదేనా అనే డౌట్ చాలామందికి కలిగింది. తాజాగా ఆ 2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించడంతో ఆ ఆసక్తికరమైన టాపిక్ మరోసారి తెరపైకొచ్చింది. అదేంటో మీరే చూడండి. 

Last Updated : May 24, 2023, 09:06 PM IST
Highest Currency Note: ఇండియాలో రూ. 5 వేలు, రూ. 10,000 నోట్లు కూడా ఉండేవి తెలుసా ?

Highest Currency Notes in India: 2016 లో రూ. 500, రూ. 1000 లాంటి పెద్ద నోట్లు రద్దు చేయడం అప్పట్లో ఒక పెద్ద హాట్ టాపిక్. ఆ తరువాత రద్దు చేసిన పెద్ద నోట్ల స్థానంలో లిక్విడిటీ కోసం ఆర్బీఐ రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చిన రూ. 2 వేల నోట్లను కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నుంచి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ చేసిన ప్రకటన దేశంలో మరోసారి సంచలనం సృష్టించింది. రూ. 2 వేల నోట్లు ప్రవేశపెట్టినప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెరపైకి వచ్చింది. తాజాగా ఆ నోట్లను ఉపసంహరించుకోవడంతో మరోసారి అదే అంశం హాట్ టాపిక్ అయింది. 

తాజాగా మరోసారి వైరల్ అవుతున్న హాట్ టాపిక్ ఏంటంటే.. ఇండియాలో రూ. 2 వేల నోటే పెద్దదా లేదంటే గతంలో ఇంతకంటే పెద్ద డినామినేషన్ నోటు ఏదైనా వచ్చిందా అనేదే చాలామందికి కలుగుతున్న సందేహం. అంతేకాదు.. ఇప్పటికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. మన దేశంలో 2 వేల నోటు కంటే పెద్ద డినామినేషన్‌లో గతంలో మరో రెండు నోట్లు ఉండేవి అని. 

Rs-2000-Notes-News-Rs-5000-Notes-photos-Rs-10000-Notes-photo.jpg

అవును.. గతంలో రూ. 5000 నోటు, రూ. 10,000 నోటు ఉండేవి. ఇప్పటి వరకు మన దేశ చరిత్రలో ఆర్బీఐ తీసుకొచ్చిన అతి పెద్ద డినామినేషన్ నోట్లు ఇవే. 1938 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలిసారిగా రూ. 10 వేల నోటును ప్రవేశపెట్టింది. ఆ తరువాత 1946, జనవరిలో ఆ నోటును రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ.. 1954 లో మరోసారి రీ-ఇంట్రడ్యూస్ చేసింది. వివిధ కారణాలతో 1978 లో రూ. 10 వేల నోటును ఆర్బీఐ శాశ్వతంగా రద్దు చేసింది. 

Rs-2000-Notes-News-Rs-5000-Notes-photos-Rs-10000-Note-photos.jpg

ఇది కూడా చదవండి : Rs 2000 Notes Viral Video: పెట్రోల్ పోసుకుని 2 వేల నోటు ఇచ్చాడనే కోపంతో.. వైరల్ వీడియో

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. 2014 లో రఘురాం రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో రూ. 5 వేలు. రూ. 10 వేల నోట్లను ప్రవేశపెట్టాలి అనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే, 2016 లో నోట్ల రద్దు జరిగినప్పుడు ఆ రద్దయిన నోట్ల స్థానంలో వీలైనంత త్వరగా మరో పెద్ద నోటును చలామణిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూ. 5,000 అలాగే రూ. 10 వేల నోటు ప్రవేశపెట్టాలనే ఆలోచనను తిరస్కరించిన అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. రూ. 2 వేల నోటును ప్రవేశపెట్టేందుకే మొగ్గుచూపారు. అంతేకాకుండా రూ. 5000, రూ. 10,000 తరహాలో పెద్ద డినామినేషన్ నోట్లను తీసుకొస్తే.. వాటిని పోలిన నకిలీ నోట్ల చలామణి కూడా అదే స్థాయిలో పెరిగిపోయే ప్రమాదం ఉందనే భయంతో ఆర్బీఐ ప్రతిపాదనకు కేంద్రం నో చెప్పింది. అలా రూ. 2 వేల నోటు చలామణిలోకి వచ్చింది. రూ. 2 వేల నోటు ఉపసంహరణ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ అంశంపై జనంలో ఆసక్తి ఏర్పడింది.

ఇది కూడా చదవండి : House for Sale for Just Rs 89: అవును.. 89 రూపాయలకే ఇల్లు కొనే ఛాన్స్..

ఇది కూడా చదవండి : Rs 2000 Notes Why and What: ఆర్బీఐ రూ. 2000 నోటును ఎందుకు ఉపసంహరించుకుందో తెలుసా ?

ఇది కూడా చదవండి : Can we Accept Rs 2000 Notes: రూ. 2000 నోటు తీసుకుంటే సమస్య తప్పదా ? ఏంటా సమస్య ?

ఇది కూడా చదవండి : Rs 2,000 Notes News: బాగా డబ్బున్నోళ్లు 2 వేల నోట్లను ఏం చేస్తున్నారో తెలుసా ?

ఇది కూడా చదవండి : RBI About 2,000 Notes: 2 వేల నోటు మార్పిడి, గడువుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు

ఇది కూడా చదవండి : RBI New Guidelines On Rs 2000 Notes: సెప్టెంబర్ 30 వరకు 100 రోజులు.. బ్యాంకులో మొత్తం ఎంత మార్చుకునే ఛాన్స్.. దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

More Stories

Trending News