Woman Thrashes Brutally Attacks On Man: సాధారణంగా కొందరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి రకారకాల ట్రిక్ లు వేస్తున్నారు. కొందరు పెళ్లిళ్లలో లేదా జనాలు ఎక్కువగా గుమిగూడి ఉన్న చోట్ల, ఒక్కసారిగా కొట్టుకొవడం, డ్యాన్స్ స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపర్చడం వంటివి చేస్తున్నారు. దీంతో అక్కడున్న వారు.. వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో వీరంతా ఓవర్ నైట్ లో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వేలాదిగా జరుగుతున్నాయి. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.
WWE kinda kalesh b/w a Couple in Public
pic.twitter.com/xLs6Kq7p5d— Ghar Ke Kalesh (@gharkekalesh) February 21, 2024
ఒక మహిళ గాజుల షాపులో ఉన్న వ్యక్తితో గొడవ పడింది. అంతటితో ఆగకుండా.. ఆమె అతని కాలర్ పట్టుకుని కిందకు ఈడ్చిపడేసింది. నార్మల్ గా మహిళలు.. అబ్బాయిల కన్నా... కాస్తంతా వీక్ గా ఉంటారు. కానీ ఈమె మాత్రం.. సదరు వ్యక్తిని కోపంతో ఎత్తిపడేస్తూ.. ఒక రేంజ్ లో ఆటాడేసుకుంది. అతని మీద ఎక్కికూర్చుని పిడిగుద్దులతో రెచ్చిపోయింది.
అతను ఎంతలా మహిళలను ఆపాలని చూసిన ఆమె మాత్రం అస్సలు తగ్గట్లేదు. చుట్టుపక్కల ఉన్న వారంతా ఇదేదో వేడుకను చూసినట్లు చూస్తున్నారు. ఆ మహిళ మాత్రం.. రబ్బర్ బాల్ ను అటు ఇట్టు పడేసినట్లు.. అటు ఇటు విసిరేస్తు మనోడిని చితక్కొట్టింది.
Read More: Trisha: త్రిష డేరింగ్ స్టెప్.. ఆ పొలిటికల్ లీడర్ పై లీగల్ యాక్షన్‌కు దిగిన తమిళ పొన్ను..
ఈ వీడియోను ఘర్ కే కాలేష్ అనేఉ యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాకింగ్ తో కామెంట్లు పెడుతున్నారు. ఇదేం విడ్డూరం బాబోయ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో హట్ టాపిక్ గా మారింది. మరికొంరుమాత్రం.. ఇది రీల్స్ కావచ్చు..కేవలం పబ్లిసిటీ కోసం ఇలా చేశారంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook