Astrology: గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఉద్యోగ, వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి..

Astrology: నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయంలో కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతాయి. అందులో గజ కేసరి రాజయోగం ఏర్పడుతోంది. అంతేకాదు లక్ష్మీ దేవి అనుగ్రహంతో కనక వర్షం కురుస్తుంది. చంద్రుడు, గురుడు కలిసి గజ కేసరి రాజయోగాన్ని ఏర్పరిచారు. దీని వల్ల మేషం నుంచి సింహం వరకు కొన్ని రాశుల వారికీ అనుకోని ధనలాభం కలిగే అవకాశాలున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 11, 2024, 07:51 AM IST
Astrology: గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..  ఉద్యోగ, వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి..

Astrology: చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి కొన్ని ప్రాంతాల్లో వసంత నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురుడు, చంద్రుడు కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. గజ కేసరి రాజయోగం వల్ల సంపద, ఆనందం మరియు సంపద పెరిగే అవకాశాలున్నాయి. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికీ విపరీతమైన రాజయోగం ఏర్పడే అవకాశం ఉంది.

మేష రాశి..
ఈ చైత్ర వసంత నవ రాత్రుల్లో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అందుతుంది. ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహా జీవితంలో జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

సింహ రాశి..
మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. కుటుంబంతో ఎక్కడికైనా వెళ్తారు. ప్రేమ సంబంధాలలో మాధుర్యాన్ని అనుభవిస్తారు. అనుకోని అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి.

తుల రాశి..
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న  పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. కోరుకున్న రంగంలో విజయాన్ని సాధిస్తారు. ఫ్యామిలీ లైఫ్ మంచిగా లీడ్ చేస్తారు. మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు..
గత కొంత కాలంగా అనుభవిస్తున్న కుటుంబ సమస్యల నుంచి బయట పడతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగు అవుతోంది. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉంటాయి. కెరీర్‌లో అనుకోని లక్ష్యాలను సాధిస్తారు.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also Read: Pawan Chiranjeevi Meet: పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీర్వాదం.. రూ.5 కోట్ల విరాళంతో భరోసా ఇచ్చిన 'అన్నయ్య'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News