Astrology Transits: ఆగస్టు నెలలో 4 గ్రహ సంచారాలు.. ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్‌ స్టార్ట్‌..

Big Planetary Transits In August: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆగస్టు నెలలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశలువారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 2, 2024, 10:29 AM IST
Astrology Transits: ఆగస్టు నెలలో 4 గ్రహ సంచారాలు.. ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్‌ స్టార్ట్‌..

Big Planetary Transits In August Telugu: గ్రహ సంచారాల పరంగా ఆగస్టు నెల కూడా చాలా ప్రధానమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలలో ఎంతో ప్రత్యేకమైన నాలుగు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. కుజుడితో పాటు బుధ, శుక్ర, సూర్య గ్రహాలు సంచారం ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించబోతున్నాయి. మొదటగా ఆగస్టు 16వ తేదిన ఎంతో శక్తివంతమైన గ్రహంగా పరిగణించే సూర్యుడు సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత ఆగస్టు 22న కర్కాటక రాశిలోకి బుధుడు సంచారం చేస్తాడు. దీంతో పాటు ఆగస్టు 25న శుక్రుడు, ఆగస్టు 26న కుజ గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం కూడా చెయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి జీవితం ఎంతో సానుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌, ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. 

ఈ గ్రహ సంచారాలతో లాభాలు పొందే రాశులు:
మేష రాశి:

ఆగస్టు నెలలో ఈ గ్రహాలు రాశి సంచారం చేయడం వల్ల మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి శుక్రుడి సంచారంతో ఆర్థిక పరిస్థితులు కూడా ఎంతగానో మెరుగుపడతాయి. ఉద్యోగాలు చేసేవారికి ఎంతో సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. అంతేకాకుండా బాస్‌ నుంచి సపోర్ట్‌ పొంది. అద్భుతమైన పేరు సంపాదిస్తారు. అలాగే వీరికి ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. దీంతో పాటు బ్యాక్‌ బ్యాలెన్స్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుటుంది. అయితే వీరు ఆహార విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.

వృషభ రాశి:
ఈ సంచారం కారణంగా వృషభ రాశివారి కెరీర్‌పై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీంతో పాటు వీరికి పనుల్లో కూడా ఊహించని లాభాలు సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయంలో మంచి కంపెనీ జాబ్స్‌ పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

కర్కాటక రాశి:
ఆగష్టు నెలలో జరిగే రాశి సంచారాల కారణంగా కర్కాటక రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కొత్త సంబంధాలు పెరుగుతాయి. దీంతో పాటు వీరికి కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా పెరుగుతాయి. దీంతో పాటు విహారయాత్రలు కూడా వెళ్తారు. అంతేకాకుండా ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 

సింహ రాశి:
ఈ నెలలో జరిగే రాశి సంచారాల కారణంగా సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. దీంతో భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా చాలా వరకు మెరగుపడతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News