Bathukamma 2023: తెలంగాణ ఫేమస్ ఫెస్టివల్ బతుకమ్మ సంబరాలు ఎలా జరుపుకుంటారో తెలుసా?

Bathukamma Festival History: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ..బంగారు బతుకమ్మ ఉయ్యాలో... అంటున్న తెలంగాణ ప్రజలు. తెలంగాణలో దసరా సందర్భంగా.. అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు జరుపుకుని ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ.. తెలంగాణ రాష్ట్ర పండుగ.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2023, 12:31 PM IST
 Bathukamma 2023: తెలంగాణ ఫేమస్ ఫెస్టివల్ బతుకమ్మ సంబరాలు ఎలా జరుపుకుంటారో తెలుసా?

Bathukamma 2023:  బతుకమ్మ.. తెలంగాణలో ఎప్పటి నుంచో జరిగే ఈ పండుగ వెనుక చాలా పెద్ద విశిష్టత ఉంది. బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి అంటే చాలు.. తెలంగాణలో గడప గడప ఆటలతో పండగ వాతావరణం సంతరించుకుంటుంది. ఇక ఈ తొమ్మిది రోజులు.. ప్రతిరోజు ప్రత్యేకమే అనే విధంగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు ప్రజలు. ఈ తొమ్మిది రోజులలో బతుకమ్మని ఒక్కొక్క రోజు ఒక్కో పేరు పెట్టి పిలుస్తారు. 

అంతేకాకుండా ఏ రోజు కారోజు వివిధ వాయనాలు ప్రసాదాలు సమర్పించి పూజలు చేస్తారు. మరి ఇలాంటి విశిష్టత ఉన్న ఈ పండగ గురించి మరిన్ని విషయాలు  తెలుసుకుందాం పదండి. బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం ప్రేత అమావాస్య లేదా పితృపక్ష అమావాస్య నాడు మొదలవుతుంది. ఈసారి అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. 

ఎంగిలిపూల బతుకమ్మ:

మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. మొదటిరోజు బతుకమ్మను ఇలా ఎందుకు పిలుస్తారు అనే విషయంపై భిన్నమైన కారణాలు ఉన్నాయి. బతుకమ్మను అందంగా గోపురం ఆకారంలో తీర్చిదిద్దడం కోసం పూలకాడలను ఒకే రీతిన ఉండడానికి కత్తిరించి అమర్చడం జరుగుతుంది. కొంతమంది దీన్ని చేత్తో గాని ,కత్తెరతో గానీ కత్తిరిస్తారు అయితే మరి కొంతమంది నోటితో కాడాలని తెంపుతారు. అందుకని  ఈ రోజున ఎంగిలిపూల బతుకమ్మ అంటారని కొందరు భావిస్తారు. మరికొన్ని ప్రాంతాలలో మొదటి రోజు అమావాస్య కాబట్టి పెద్దల ఆత్మకు శాంతి కలగాలి అని తర్పణాలు వదిలి ఇంట్లో ఉదయాన్నే భోజనాలు చేస్తారు ఈ కారణం చేత  బతుకమ్మను ఏర్పాటు చేయడానికి ముందే ఎంగిలి పడతారు కాబట్టి ఎంగిలి బతుకమ్మ అని పిలుస్తారని భావిస్తారు.

అటుకుల బతుకమ్మ:

రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఆరోజు బతుకమ్మకు చప్పిడి పప్పు, బెల్లం ,అటుకులతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ:

ముచ్చటగా మూడవ రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈరోజు బతుకమ్మకు ముద్దపప్పు, బెల్లం ,పాలు ,పాలతో చేసిన ఇతర పదార్థాలను నైవేద్యంగా సమర్పించుకుంటారు.

నానబియ్యం బతుకమ్మ:

నాలుగవ రోజు బతుకమ్మను నాన్న బియ్యం బతుకమ్మ అని అంటారు. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం వంటి వాటిని నైవేద్యంగా బతుకమ్మకు సమర్పించడం జరుగుతుంది.

అట్ల బతుకమ్మ:

ఐదవ రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు బతుకమ్మకు అట్లు అదేనండి దోశలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

అలిగిన బతుకమ్మ :

ఆరవ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అని అంటారు. ఈరోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టరు.

వేపకాయల బతుకమ్మ:

ఏడవ రోజున బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అని పిలవడంతో పాటు  బియ్యప్పిండితో వేపకాయలు లాగా తయారుచేసి వాటిని బాగా నూనెలో వేయించి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ:

ఎనిమిదవ రోజు బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈరోజు బతుకమ్మకు నువ్వులు, వెన్న ముద్ద ,బెల్లం వంటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు.

సద్దుల బతుకమ్మ:

ఇక తొమ్మిదవ రోజు అశ్వయుజ అష్టమి అదే దుర్గాష్టమి. ఈనాడు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు అమ్మకు పెరుగు అన్నం , చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం ,నువ్వుల అన్నం నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది.

Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!  

Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

 

Trending News