Blue Saphire Benefits: ఆ రత్నం ధరిస్తే అన్ని కష్టాలు దూరం, ఎలా ధరించాలి

Blue Saphire Benefits: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వజ్రాలు, రత్నాలకు ప్రాధాన్యత ఉంది. గ్రహాలతో లింక్ ఉంటుంది. అది గ్రహించి ఏ రత్నం ధరించాలో తెలుసుకుంటే..సమస్యలన్నీ దూరమౌతాయి. శని ప్రభావాన్ని సైతం సానుకూలంగా మార్చవచ్చంటున్నారు.

Last Updated : Jul 11, 2022, 10:33 PM IST
Blue Saphire Benefits: ఆ రత్నం ధరిస్తే అన్ని కష్టాలు దూరం, ఎలా ధరించాలి

Blue Saphire Benefits: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వజ్రాలు, రత్నాలకు ప్రాధాన్యత ఉంది. గ్రహాలతో లింక్ ఉంటుంది. అది గ్రహించి ఏ రత్నం ధరించాలో తెలుసుకుంటే..సమస్యలన్నీ దూరమౌతాయి. శని ప్రభావాన్ని సైతం సానుకూలంగా మార్చవచ్చంటున్నారు.

హిందూమతంలో జాతకానికి, వాస్తుకు ఎనలేని విశిష్టత, ప్రాధాన్యత ఉంది. కుండలిలో గ్రహాల కదలికల్ని బట్టి ప్రభావం మారుతుంటుంది. గ్రహాల సానుకూల, ప్రతికూల ప్రభావాన్ని మార్చేందుకు రత్నాలు, వజ్రాలు, కెంపులు ఎలా ఎప్పుడు ధరించాలనేది జ్యోతిష్యశాస్త్రం వివరిస్తుంది. శని సానుకూల ప్రభావాన్ని సైతం రత్నాల ధారణతో మార్చవచ్చంటున్నారు పండితులు. కుండలిలో శని అనుకూలంగా లేకుంటే..నీలం రత్నం ధరించాలని సూచిస్తున్నారు. 

కుండలిలో శనికి బలాన్నిచ్చేందుకు నీలం రత్నాన్ని ధరిస్తుంటారు. ఈ రత్నం చాలా ఖరీదైంది. నీలం రత్నంతో ఆకాశానికి ఎత్తేయడం లేదా కింద పడేయం రెండూ జరగవచ్చంటున్నారు. నీలం రత్నం పూర్తి ప్రయోజనాలు లభించకపోవడానికి కొన్ని కారణాలుంటాయి. 

కుండలిలో విభిన్న గ్రహాలకు శక్తినిచ్చే రత్నాలు ధరించేందుకు కొన్ని సూచనలున్నాయి. రత్నాలకు సంబంధించి కుటుంబ సంబంధాలు కూడా ముడిపడి ఉంటాయి. అందుకే ఎవరైనా వ్యక్తికి ఏదగైనా రత్నం ధరించమని సూచించేటప్పుడు..రత్నంతోపాటు సంబంధిత బంధుత్వాల్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. లేకపోతే రత్నాన్ని ధరించినా ఆశించిన ఫలితాలు దక్కవు. రత్నాల పూర్తి లాభాలు పొందాలంటే..ఆ రత్నంతో సంబంధమున్న బంధాల మహత్యం, గౌరవం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తెలిసో తెలియకో రత్నం ధరించి..ఆ బంధాలను అవమానపరిస్తే..సమస్యలు ఎదురౌతాయి. నీలం రత్నం ప్రయోజనాలు, ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసేందుకు ఈ రత్నాన్ని వినియోగిస్తారు..నీలం రత్నానికి  సంబంధించిన బంధాల గురించి తెలుసుకుందాం..

శరీరంలోని స్థూల, సూక్ష్మ భాగాల సంబంధం వివిధ గ్రహాలతో ముడిపడి ఉంటాయి. శనిదేవుడు ప్రక్రృతిని ఆధీనంలో ఉంచుకునే భూమి ఆధారిత గ్రహం. నీలం రత్నం శనికి చెందిన రత్నం. శనిగ్రహం కిరణాలు నీలం రంగులో ఉంటాయి ఈ రత్నం కూడా నీలం రంగులోనే ఉంటాయి. నీలం రత్నం వల్ల సాధారణంగా వెంటనే లాభాలు కలుగుతాయి. నీలం రత్నం సెట్ అయితే ఆ వ్యక్తి ఆకాశానికి ఎదిగిపోతాడు. లేదంటే ఫటేల్మని కిందకు పడిపోతాడని అంటారు. అందుకే ఇది ధరించేటప్పుడు చాలా విషయాల్ని పరిగణలో తీసుకోవాలి. నీలం ఓ ఖరీదైన రత్నం కూడా. 

శని కుటుంబంలో సేవకుడికి ప్రాతినిధ్యం ఉంటుంది. కాలికి ప్రాధాన్యత ఉన్నందున పెద్దల కాళ్లు పట్టుకోవాలనే నియమం ఉంది. దీనివల్ల వ్యక్తిలో వినమ్రత ఉంటుంది. సాధారణ ప్రజల ప్రతినిధి కూడా శనిదేవుడే. నీలం రత్నం ఖరీదైంది, దీన్ని ధరించేవాళ్లు సామాజిక సేవలో ఉండాలి. మార్గమధ్యంలో ఎవరైనా గాయపడి కన్పిస్తే వారికి సహాయం అందించడంలో వెనుకాడకూడదు. కూలీల విషయంలో, రిక్షా కార్మికుని విషయంలో బేరసారాలు చేయకుండా అడిగింది ఇవ్వాలి. రిక్షా కార్మికుడు ఇంటివరకూ డ్రాప్ చేసినప్పుడు కనీసం మంచినీళ్లు అందించి పంపాలి. నీలం రత్నపు దేవత శని. శనిని న్యాయదేవతగా కూడా పిలుస్తారు. న్యాయం అందించేటప్పుడు ఎవరికీ పక్షపాతం వహించరు. న్యాయం అందించేటప్పుడు సంబంధీకులను కూడా పట్టించుకోదు. తప్పు చేసినవారికి తప్పకుండా దండన లభిస్తుంది. అందుకే శనిని దండాధికారిగా కూడా పిలుస్తారు. దండించే అధికారి కాబట్టే శని అంటే అందరికీ భయం. వాస్తవానికి శనిదేవుడు న్యాయప్రియుడు,తప్పు చేసేవారినే దండిస్తాడు. 

Also read: Venus and Mercury: బుధ శుక్ర గ్రహాలు మిధునంలో..ఆ నాలుగు రాశులకు ఊహించని ధనలాభం, జూలై 13 నుంచి

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News