Budh Rahu Gochar 2023: మేషరాశిలో బుధుడు-రాహువు కలయిక.. ఈ 5 రాశుల వారు కెరీర్‌లో దూసుకుపోవడం పక్కా..

Budh Gochar 2023: మార్చి 31న బుధుడి  రాశి మార్పు జరగనుంది. ఇప్పటికే రాహువు అదే రాశిలో సంచరించనున్నాడు. బుధుడి, రాహువు కలయిక వల్ల కొన్ని రాశులవారికి మేలు జరగనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2023, 01:22 PM IST
Budh Rahu Gochar 2023: మేషరాశిలో బుధుడు-రాహువు కలయిక.. ఈ 5 రాశుల వారు కెరీర్‌లో దూసుకుపోవడం పక్కా..

Mercury Transit in Aries 2023: మరో రెండు రోజుల్లో అంటే మార్చి 31వ తేదీ మధ్యాహ్నం 2.44 గంటలకు బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు.  ఆ తర్వాత సూర్యుడు కూడా ఏప్రిల్ 14న మేషరాశిలోకి ప్రవేశించి బుధుడుతో బుధాదిత్య యోగం ఏర్పరుస్తాడు. ఈ శుభ యోగ ప్రభావం వల్ల అనేక రాశుల వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే బుధుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. మెర్య్కూరీ మేషరాశిలో రాహువుతో కలిసి ఉండటం వల్ల ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 

మిథునం (Gemini) 
మీ రాశిచక్రంలోని 11వ ఇంట్లోకి బుధుడు ప్రవేశిస్తాడు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మునుపటి కంటే ఎక్కువగా డబ్బును ఆదా చేస్తారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఈ సమయంలో భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరితో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. బుధవారం నాడు పచ్చతో కూడిన బంగారపు ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశిలో సంచరించే సమయంలో బుధుడు 10వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు సొంత వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీ కుటుంబ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో మంచి అవకాశాలను పొందుతారు. ప్రతి బుధవారం ఆవుకు పాలకూర తినిపించడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. 
సింహ రాశి (leo)
సింహ రాశి వారికి బుధుడు మీ రాశిచక్రంలోని తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది.  మీరు భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేస్తారు. మీ డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి. మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీకు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రతి బుధవారం మూంగ్ పప్పు తినడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 

ధనస్సు (Sagittarius)
బుధుడు ధనుస్సు రాశి యెుక్క ఐదవ ఇంట్లోకి ప్రవేశించనున్నాడు. దీంతో మీకు లక్ కలిసి వస్తుంది. అంతేకాకుండా మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. 
కుంభం (Aquarius)
కుంభ రాశి వారి యెుక్క జాతకంలో మూడవ ఇంట్లో బుధ గ్రహ సంచారం జరగబోతోంది. దీని కారణంగా మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. పరిహారంగా అక్కలకు బహుమతులు ఇవ్వండి.

Also Read: Surya Gochar 2023: ఉన్నతమైన రాశిలోకి సూర్యభగవానుడు.. మే 15 వరకు ఈ 4 రాశులవారు జాగ్రత్త..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News