Budhaditya Yoga In Telugu: గ్రహసంచారాలపరంగా జూన్ నెల ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకంటే గ్రహాలకు రాకుమారుడుగా భావించే బుధుడు, సూర్యుడు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా భూతగ్రహం జూన్ 14న వృషభ రాశిని వదిలి మిథున రాశిలోకి సంచారం చేస్తుంది. ఇక సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఓకే రాజులు ఈ రెండు గ్రహాలు కలయిక జరగబోతోంది. కాబట్టి జూన్ 14వ తేదీ 12 గంటల 27 నిమిషాలకు బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ బుధాదిత్య రాజయోగం ఏర్పడడం కారణంగా వృషభ రాశితో పాటు మరికొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. అయితే మిథున రాశిలో సూర్యుడు బుధుడు కలవడం వల్ల ఏయే రాష్ట్ర వారికి ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
వృషభ రాశి:
ఈ బుధాదిత్య రాజయోగం ఏర్పడడం కారణంగా వృషభ రాశి వారు అన్ని రంగాల్లో ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరి ఆనందం రెట్టింపు అవుతుంది సంపాదన కోసం వీరు డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో ప్రియమైన వారికోసం సెలవులు కేటాయించి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో వీరు మనస్సు ఎంతో ప్రశాంతంగా మారుతుంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారికి పురోగతి లభించి ఆర్థిక లాభాలు పలుకుతాయి. ముఖ్యంగా సమాజ సేవ చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
మిథున రాశి:
మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం ఎంతో శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల కలయికతో జూన్ నెల నుంచి వీరు అనేక లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన లాభాలు పొందడమే కాకుండా విజయాలు సాధిస్తారు. గతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా వీరికి సంభాషణ శైలి కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక సూర్యుడి అనుగ్రహంతో వీరికి సమాజంలో గౌరవం లభించి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కుటుంబంలో వస్తున్న వివాదాలు సులభంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి కూడా ఈ సమయంలో విముక్తి లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
సింహరాశి:
బుధాదిత్య రాజయోగం కారణంగా సింహరాశి వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుబడడమే కాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు డబ్బు సంబంధిత విషయాల్లో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు భాగస్వామి జీవితం కూడా చాలా మెరుగు పడుతుంది. ఈ సమయంలో డబ్బులు సంపాదించేందుకు కొత్త ఆదాయ వనరులు వెతుక్కుంటారు. అలాగే జీవన శైలిలో మార్పులు కూడా వస్తాయి. దీంతోపాటు చిన్న చిన్న సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి