Laxmi Narayan Yog: ఈ రాశుల వారిపై లక్ష్మీనారాయణ యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి జీవితంలో ఊహించని లాభాలే లాభాలు..

Laxmi Narayan Yog: కొన్ని గ్రహాల కలయిక కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా అన్ని రాశుల వారిపై భారీ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ యోగం కారణంగా ఏయే రాశుల వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో మనం ఇప్పుడు చూద్దాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 3, 2023, 12:11 PM IST
Laxmi Narayan Yog: ఈ రాశుల వారిపై లక్ష్మీనారాయణ యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి జీవితంలో ఊహించని లాభాలే లాభాలు..

Laxmi Narayan Yog: కర్కాటక రాశిలో కొన్ని గ్రహాల కలయిక కారణంగా జ్యోతిష్య శాస్త్రంలో చాలా పవిత్రమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగాన్ని అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఈ యోగాన్ని ఊహించని సంపద, కీర్తి, శుభంగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణిస్తారు. బుధుడు శుక్రుడు సంచార క్రమంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని లాభాలతో పాటు అదృష్టాన్ని కూడా పొందుతారు. ఏయే రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీ నారాయణ యోగా అంటే ఏమిటి?
లక్ష్మీ నారాయణ యోగం అనేది శుక్ర , బుధ గ్రహాల కలయిక ఉన్నప్పుడు ఏర్పడే శుభ యోగం. శుక్రుడు విలాసానికి, అందానికి, కీర్తిగా.. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, తర్కానికి సూచికగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణిస్తారు. బుద్ధుడిని విష్ణువుగా.. శుక్రుడిని లక్ష్మీదేవిగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తారు. రెండు గ్రహాల కలయిక కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుందని.. ఇది జాతకంలో ప్రత్యేక స్థానంలో ఉంటే జీవితాంతం ఆర్థికంగా లోటుండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు.

మిథునరాశి:
రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం కారణంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మిధున రాశి వారికి జాతకంలో ధన గృహంలో ఏర్పడబోతోంది. కాబట్టి ఈ రాశి వారు ఊహించని ధన లాభాన్ని పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. డబ్బు, ఆస్తి, వ్యాపార లావాదేవీలు, పెట్టుబడులు, రాబడి పరంగా అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే.. ఈ యోగ క్రమంలో పెట్టుబడి పెట్టే వారికి భారీ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరు కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు. కళలు, రంగస్థలం, మీడియా, వినోద రంగాలకు సంబంధించిన వ్యక్తులు మంచి విజయాలు సాధిస్తారు.

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

కన్య రాశి:
లక్ష్మీ నారాయణ యోగం కన్యారాశి వారికి శుభప్రదం, ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జాతకంలో ఆదాయ గృహంలో ఈ యోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా మీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఖర్చులన్నీ తగ్గి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఇంతకుముందు పెట్టుబడులు పెట్టిన వాటిలో లాభాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మీ పిల్లలనుంచి కూడా వీలైనంత త్వరగా శుభవార్తలు వినవచ్చు. ఈ క్రమంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి మూడు రేట్ల లాభాలు కలుగుతాయి. 

తుల రాశి:
తులారాశి వారి జాతకంలో లక్ష్మీనారాయణ యోగం శుభస్థానంలో ఏర్పడబోతోంది. దీని కారణంగా ఆదాయంలో భారీ మార్పులు వస్తాయి. వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆదాయం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు స్థాన చలనం కారణంగా ప్రమోషన్స్ తో పాటు భారీ ప్యాకేజీలు పొందే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారు లక్ష్మీనారాయణ యోగం కారణంగా ఎలాంటి కోరికలు కోరుకున్న విజయాలు సాధిస్తారు.

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News