Venus Transit 2023: శుక్ర గ్రహ సంచారంతో ఈ 5 రాశులవారికి ఈ నెలలో 100 శాతం జరగబోయేది ఇదే!

Venus Transit 2023: శుక్ర గ్రహ సంచారం ప్రభావం కొన్ని రాశులవారిపై శుభ ఫలితాలను కలిగించ బోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచార సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా గొప్ప విజయాలు సాధిస్తారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2023, 09:03 AM IST
Venus Transit 2023: శుక్ర గ్రహ సంచారంతో ఈ 5 రాశులవారికి ఈ నెలలో 100 శాతం జరగబోయేది ఇదే!

Venus Transit 2023: ఈ సంవత్సరం నవంబర్‌ నెలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో గ్రహాల్లో ముఖ్యమైన గ్రహాలు శుక్రుడు, శని, బుధుడు, కుజుడుతో పాటు సూర్యుడు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఎంతో ప్రత్యేకత కలిగిన శుక్ర గ్రహం కూడా ఇదే నెలలో సంచారం చేసింది. ఈ గ్రహం ఈ రోజు ఉదయం 4:58 గంటలకు కన్యారాశిలోకి సంచారం చేసింది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడుని సంపద, ఐశ్వర్యం, ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు స్టార్ట్‌ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

ఈ రాశులవారిపై ప్రభావం:
మేష రాశి:

శుక్ర సంచార ప్రభావం వల్ల మేష రాశివారికి ఈ నెల చాలా బాగుటుంది. వీరు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు ఇష్టపడతారు. అంతేకాకుండా ప్రేమ జీవితాన్ని అనుభవిస్తున్నవారు మంచి లాభాలు పొందుతారు. వీరు ఆకర్శనీయంగా ఉండడం వల్ల ప్రజలను సులభంగా ఆకట్టుకుంటారు. 

వృషభ రాశి:
శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది.  ఈ సమయంలో వీరికి ఉత్కంఠ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సంచారంతో ఎప్పుడు పొందలేనంత ఆనందం కూడా పొందుతారు. 

మిథున రాశి:
శుక్రుడి సంచారం కారణంగా  మిథున రాశి వారికి శుభ సమయం ప్రారంభం కాబోతోంది. వీరు ఈ సమయంలో మంచి పనులు చేయడం వల్ల భవిష్యత్‌లో లాభాలు పొందుతారు. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా మెరుగుపడతాయి. దీంతో పాటు వీరు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తారు. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

కర్కాటక రాశి:
నవంబర్ 3 నుంచి ఈ రాశివారికి కూడా జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు ప్రతి రంగంలో  విజయాలను పొందుతారు. మనసు ఆనందంగా ఉండడమే కాకుండా కుటుంబ సభ్యులతో ఖుషిగా ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

సింహ రాశి:
శుక్రుని సంచార ప్రభావం సింహ రాశివారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ సమయంలో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.  

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News