Dussehra 2022: ఈ ఏడాది దసరా ఎప్పుడు, విజయ దశమి మహత్యం, తేదీ, ముహూర్తం ఎప్పుడంటే

Dussehra 2022: హిందూ పంచాంగం ప్రకారం దసరా ముఖ్యమైన పండుగ. ప్రతియేటా అశ్విని మాసం శుక్లపక్షం దశమతిధి నాడు దసరా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. దసరా ఈ ఏడాది ఎప్పుడు, శుభ ముహూర్తం, తిధి ఎప్పుడనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 5, 2022, 10:05 PM IST
Dussehra 2022: ఈ ఏడాది దసరా ఎప్పుడు, విజయ దశమి మహత్యం, తేదీ, ముహూర్తం ఎప్పుడంటే

Dussehra 2022: హిందూ పంచాంగం ప్రకారం దసరా ముఖ్యమైన పండుగ. ప్రతియేటా అశ్విని మాసం శుక్లపక్షం దశమతిధి నాడు దసరా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. దసరా ఈ ఏడాది ఎప్పుడు, శుభ ముహూర్తం, తిధి ఎప్పుడనేది తెలుసుకుందాం..

ప్రతియేటా అశ్వని మాసంలోని శుక్లపక్షపు దశమ తిధి నాడు దసరా పండుగ జరుపుకుంటారు. దీనినే విజయదశమిగా పిలుస్తారు. దసరా పండుగ దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను చూస్తారు. ఈరోజునే శ్రీరాముడు..రావణుడిని సంహరించి భూమండలాన్ని అతడి ప్రకోపం నుంచి కాపాడుతాడు. ఈ రోజున శ్రీరాముడిని పూజించడం వల్ల జీవితంలో అంతా పాజిటివ్‌నెస్ వస్తుంది. అంతేకాదు..రావణుడి బొమ్మను దహనం చేస్తారు. 

ఈ ఏడాది దసరా ఎప్పుడు

దసరా పండుగ ప్రతియేటా దీపావళికి 20 రోజుల ముందు వస్తుంది. ఈ ఏడాది దసరా అక్టోబర్ 5న ఉంది. అంటే అక్టోబర్ 5 కంటే 9 రోజుల ముందు నుంచి దుర్గాదేవి నవరాత్రులు నిర్వహిస్తారు. 

విజయ దశమి ముహూర్తం

అశ్విని మాసంలోని శుక్లపక్షం దశమి తిధి అక్టోబర్ 4 మద్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై..అక్టోబర్ 5 మద్యాహ్నం 12 గంటల వరకూ ఉంటుంది. అక్టోబర్ 5 మద్యాహ్నం 2 గంటల 13 నిమిషాల్నించి 3 గంటల వరకూ విజయదశమి పూజా ముహూర్తమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

దసరా మహత్యం

దసరా రోజునే శ్రీరాముడు..అహంకారైన రావణుడిని హతమారుస్తాడు. ఈ ఆనందంలోనే శ్రీరాముడిని దసరా రోజున పూజిస్తారు. ఈ రోజు శ్రీరాముడి నామజపంతో భక్తుల కష్టాలు దూరమౌతాయి. పౌరాణిక గ్రంధాల ప్రకారం..దసరా నాడు ఆయుధ పూజ ప్రధానంగా జరుగుతుంది. దసరా పండుగ దేశంలో అత్యంత ఘనంగా జరిగేది దక్షిణాదిలోనే కావడం విశేషం. దక్షిణాది పెద్ద పండుగల్లో ఒకటి విజయ దశమి. 

Also read: Ganesh Pooja on Wednesday: బుధవారం నాడు గణేశుడికి ఇలా పూజలు చేస్తే..అంతా ఐశ్వర్యమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News