Ganesh Chaturthi 2022: వినాయక చవితి ఎప్పుడు, ప్రాధాన్యతేంటి, పండుగ శుభాకాంక్షలు ఎలా చెప్పాలి

Ganesh Chaturthi 2022: హిందూవులకు అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి గణేష్ చతుర్ది లేదా వినాయక చవితి. దేశమంతా అత్యంత ఘనంగా జరుపుకునే వినాయక చవితి ఎప్పుడు, ప్రాధాన్యతేంటి, పండుగ శుభాకాంక్షలు ఎలా చెప్పాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 24, 2022, 01:57 PM IST
Ganesh Chaturthi 2022: వినాయక చవితి ఎప్పుడు, ప్రాధాన్యతేంటి, పండుగ శుభాకాంక్షలు ఎలా చెప్పాలి

Ganesh Chaturthi 2022: హిందూవులకు అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి గణేష్ చతుర్ది లేదా వినాయక చవితి. దేశమంతా అత్యంత ఘనంగా జరుపుకునే వినాయక చవితి ఎప్పుడు, ప్రాధాన్యతేంటి, పండుగ శుభాకాంక్షలు ఎలా చెప్పాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో వరుస పండుగల సీజన్ ప్రారంభమైపోయింది. అతి ముఖ్యమైన గణేశ్ చతుర్ధి లేదా వినాయక చవితి సమీపిస్తోంది. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31న ఉంది. గణేశ్ చతుర్ధిగా గణేషోత్సవ్‌గా, గణపతి పూజగా పదిరోజులపాటు జరుపుకుంటారు. చివరిరోజున భారీ ఊరేగింపులతో వినాయక నిమజ్జనం ఉంటుంది. గణేశుని నిమజ్జనం ఈసారి సెప్టెంబర్ 9వ తేదీన ఉంది. 

హిందూమత విశ్వాసాల ప్రకారం అత్యంత ఆదరణ కలిగిన దేవుడు గణేషుడు లేదా వినాయకుడు లేదా బొజ్జ గణపతి లేదా లడ్డూ వినాయకుడు. సంపద, జ్ఞానం, విజయం, విజ్ఞానం, ఆరోగ్యం, ధన సంపదలకు ప్రతీకగా భావించి..పూజలు చేస్తారు. ముఖ్యమైన లేదా కొత్త పనులు ప్రారంభించేముందు గణపతి పూజతోనే ప్రారంభిస్తారు. గణేశునికి 108 పేర్లతో పిలుస్తారు. 

గణేశ్ చతుర్ది 2022 నేపధ్యం, ప్రాధాన్యత

శివ పార్వతుల కుమారుడు గణేశుడు. గణేశుని పుట్టుకకు సంబంధించి విభిన్న కధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గణేశుడిని పార్వతీ దేవి సృష్టించిందనేది సర్వత్రా ప్రాచుర్యంలో ఉన్న కథ. శివుడు అందుబాటులో లేనప్పుడు స్నానానికి వెళ్లిన పార్వతి..తనకు రక్షణగా శాండల్‌వుడ్ పేస్ట్‌తో గణేశుని సృష్టించి కాపలా పెడుతుంది.అదే సమయంలో తిరిగొచ్చిన శివుడిని..ఎవరో తెలియక గణేశుడు తల్లి ఆదేశాల మేరకు లోపలకు వెళ్లకుండా నిలువరిస్తాడు. దీంతో ఆగ్రహించిన శివుడు కోపంతో గణేశుడి తల నరికేస్తాడు. ఈ విషయం తెలిసిన పార్వతి కోపంతో రగిలిపోతుంది. కాళికా దేవి అవతారమెత్తి..ప్రపంచాన్ని నాశనం చేస్తానంటుంది. ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోయి..కాళికా దేవిని శాంతింపజేసే పరిష్కారం సూచించాల్సిందిగా శివుడిని ప్రాధేయపడతారు. వెంటనే శిరచ్ఛేదమైన తలను తీసుకురావల్సిందిగా శివుడు అనుచరుల్ని పురమాయించగా..ఆ క్రమంలో వారికి కన్పించిన ఏనుగు తలను తీసుకొస్తారు. ఆ తల గణేశుడి దేహానికి అమర్చి ప్రాణం పోస్తాడు. ఈ కధ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. 

గణేశ్ చతుర్ధి లేదా వినాయక చవితి 2022 వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. గత రెండేళ్లుగా కోవిడ్ 19 ఆంక్షల కారణంగా జరుపుకోలేదు. ఈసారి ఘనంగా జరుపుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

హ్యాపీ గణేష్ చతుర్ధి 2022 విషెస్, గ్రీటింగ్స్ ఇలా

May Ganesh bestow happiness and abundance to you and your family
May Bappa brings your home real happiness and prospertiy
May vinayaka brings a thousand blessing to you and clear your path for growth
May Ganesha brings you health, wealth and joy
May Ganesh gives you happiness and blessings
Be grateful and worship lord vinayaka for luck and remover of obstacles. Happy Ganesh Chaturthi 2022..Happy Vinayaka Chavithi 2022

Also read: Guru Pushya yogam 2022: 1500 ఏళ్ల తర్వాత ఆగస్టు 25న గురు పుష్య యోగంలో అరుదైన యాదృచ్చికం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News